Begin typing your search above and press return to search.

వావ్.. ఎంపీ కొండా గ్రేట్ భయ్..

By:  Tupaki Desk   |   16 July 2016 5:21 AM GMT
వావ్.. ఎంపీ కొండా గ్రేట్ భయ్..
X
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకూ సామాన్యులు మొదలుకొని అసమాన్యుల వరకూ చాలానే కార్యక్రమాలు చేపట్టారు. సామాన్యుల సంగతిని పక్కన పెడితే.. ఈ కార్యక్రమంలో భాగంగా రాజకీయ నేతలు.. సెలబ్రిటీలు.. వ్యాపార దిగ్గజాలు చాలానే కార్యక్రమాలు నిర్వహించాయి. పార్కులు.. రోడ్లు.. ఇలా అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా చాలానే చోట్ల స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రధాని మోడీ స్వయంగా చీపురు పట్టటంతో ఒక ఉద్యమం మాదిరి చాలామంది ప్రముఖులు రోడ్ల మీదకు చీపుర్లతో వచ్చేశారు. కాలం గడిచే కొద్దీ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా చాలానే కార్యక్రమాలు చేపట్టారు. కానీ.. ఇప్పటివరకూ ఏ రాజకీయ నేత.. ప్రముఖుడు చేయని ఒక పనిని తాజాగా చేశారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్.. గొల్లపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లను క్లీన్ చేసి వార్తల్లో నిలిచారు.

స్వచ్ఛభారత్ పేరుతో చీపుర్లు పట్టుకొని హడావుడి చేయటం ఒక ఎత్తు.. పాఠశాలల్లో టాయిలెట్లను శుభ్రం చేయటం మరో ఎత్తు. ఏమైనా ఎంపీగా ఉండి.. స్వచ్ఛభారత్ లో భాగంగా స్కూల్ టాయిలెట్లను శుభ్రం చేసిన విషయంలో కొండా గ్రేట్ అని చెప్పక తప్పదు.