Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డి సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   28 Jun 2021 2:30 PM GMT
కోమటిరెడ్డి సంచలన నిర్ణయం
X
రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించడం తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి రాజేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే ‘టీపీసీసీ పోస్టు అమ్ముడుపోయిందని' ఆరోపించాడు. ఇక గాంధీ భవన్ మెట్లు ఎక్కనని శపథం చేశాడు.

ఆ వేడి చల్లారకముందే తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయపరమైన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించారు. కేవలం ప్రజా సమస్యలు తీర్చేందుకు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని ప్రకటించిన ఆయన తనను రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇక నుంచి భువనగిరి, నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి అక్కడ సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తానన్న ఆయన.. పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాల మీదే దృష్టి పెట్టాలని నిర్ణయం తీసకున్నట్టు తెలిపారు.

ఇక తన కూమారుడు 'ప్రతీక్ ఫౌండేషన్' ద్వారా వీలైనంత సేవా కార్యక్రమాలు చేపడుతానని కోమటిరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాతోపాటుతెలంగాణ వ్యాప్తంగా ఎవరైనా తన తలుపు పట్టవచ్చని పిలుపునిచ్చారు. ఇక నుంచి నో పొలిటికల్ కామెంట్స్ అని ప్రకటించారు.

పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించిన కోమటిరెడ్డి ఆ పదవి అధిష్టానం రేవంత్ రెడ్డికి కట్టబెట్టడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా అంగీకరించకుండా కోమటిరెడ్డి అగ్గి రాజేస్తున్నారు.