Begin typing your search above and press return to search.

కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతూనే... కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌.. హాట్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   14 Aug 2021 2:51 PM GMT
కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతూనే... కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌.. హాట్ కామెంట్స్‌
X
తెలంగాణ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ బ్ర‌ద‌ర్స్‌గా గుర్తింపు పొందిన‌.. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, వెంక‌ట‌రెడ్డిలు.. తాజాగా చేసిన వ్యాక్య‌లు రాష్ట్ర రాజకీయాల్లో వేడిపుటిస్తున్నాయి. ఆది నుంచి కూడా రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ.. ప్ర‌త్యేక వైఖ‌రినిప్ర‌ద‌ర్శించే ఈ సోద‌రులు ఇద్ద‌రూ.. టాక్ ఆఫ్‌ది పాలిటిక్స్‌గా నిలుస్తున్నారు. సొంత పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించినా.. అధికార పార్టీపై నిప్పులు చెరిగినా.. వారి స్ట‌యిల్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్య‌లు చేసినా.. వారి దూకుడు వేరేగా ఉంటుంది. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను.. అక్క‌డ కుమ్మ‌రిస్తున్న నిధుల‌ను, చేప‌డుతున్న ప‌థ‌కాల‌ను ఈ సోద‌రులు ఇద్ద‌రూ కూడా త‌ప్పుప‌డుతున్నారు.

కేవ‌లం ఉప ఎన్నిక‌లు వ‌స్తేనే.. కేసీఆర్‌కు ప్ర‌జ‌లు క‌నిపిస్తార‌ని.. అభివృద్ధి చేయాల‌నే స్పృహ వ‌స్తుంద‌ని..కొన్నాళ్లుగా కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనూ అభివృద్ధి చేయాల‌ని.. అలా చేస్తే.. తాను పోటీ నుంచి త‌ప్పుకొంటాన‌ని.. రాజ‌గోపాల్ రెడ్డి స‌వాల్ సంధించారు. ప్ర‌స్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజ‌గోపాల్‌రెడ్డి.. హుజూ రాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు..ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ఆ ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం చేయ‌డం ఏంట‌ని..కొన్నాళ్లుగా ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అదేస‌మ యంలో హుజూరాబాద్‌కు 2000 కోట్ల‌రూపాయ‌లు కేటాయించ‌డం, అభివృద్ధి ప‌నులుచేయ‌డంపైనా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా.. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తే ఎమ్మెల్యే పదవికి పోటీ చేయనని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. కావాలంటే.. ఇక్క‌డ కూడా ఉప ఎన్నిక పెట్టుకోండ‌ని.. కానీ, నియోజ‌క‌వ‌ర్గాన్ని మాత్రం అభివృద్ధి చేయాల‌ని ఆయ‌న కోరుతున్నారు. అదేస‌మ‌యంలో నిశిత విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ సర్పంచ్ ఉన్న గ్రామాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేని శంకుస్థాపన చేయనీయడం లేదని ఆయన ఆరోపించారు. ఇదే వైఖ‌రి కొన‌సాగితే.. టీఆర్ ఎస్‌ మంత్రిని మునుగోడు నియోజకవవర్గంలో తిరగనీయమని హెచ్చరించారు. ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ వేల కోట్లు కుమ్మరించడం సీఎం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. ఇతర పార్టీ నేతలను ఎన్నికల్లో గెలవనీయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

మ‌రోవైపు.. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా ఇదే త‌ర‌హాలో కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. ప్ర‌స్తుతం భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటిం చారు. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో పలు పనులకు సంబధించి కాంట్రాక్టర్లకు రూ. 1,350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. హిట్లర్ బతికుంటే కేసీఆర్‌ను చూసి ఏడ్చేవాడని వెంకటరెడ్డి ఎద్దేవాచేశారు. కేవ‌లం త‌న‌కు, త‌న కుటుంబానికి, త‌న పార్టీకి మాత్రం సీఎం కేసీఆర్ మేలు చేసుకుంటున్నార‌ని.. ఉప ఎన్నిక వ‌స్తేనే ఆయ‌న‌కు ప్ర‌జ‌లు క‌నిపిస్తున్నార‌ని అన్నారు. మొత్తంగా చూస్తే.. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌.. కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మార‌డం గ‌మ‌నార్హం.