Begin typing your search above and press return to search.

టీవీ ఛాన‌ల్ పెట్టనున్న‌ కోమ‌టిరెడ్డి

By:  Tupaki Desk   |   5 Nov 2016 4:46 AM GMT
టీవీ ఛాన‌ల్ పెట్టనున్న‌ కోమ‌టిరెడ్డి
X
తెలుగు టీవీ ముఖ‌చిత్రంపై మ‌రో రాజ‌కీయ ఛాన‌ల్ కొలువు దీర‌నుందా? రాజ‌కీయ పార్టీకి అనుబంధంగా ఉండే టీవీ ఛాన‌ల్ల జాబితాలో మ‌రో సంఖ్య జ‌త‌కూడ‌నుందా? కాంగ్రెస్ పార్టీకి టీవీ ఛాన‌ల్ లేద‌నే లోటు తీరిపోనుందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం కాంగ్రెస్ డైన‌మిక్ ఎమ్మెల్యే - సీఎల్పీ ఉప‌నేత కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సోద‌రుడైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ టీవీ ఛాన‌ల్‌ ను ప్రారంభించ‌నున్నారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ ఛానల్ పనులు వేగంగా జరిగిపోతున్నాయి.

తుపాకి బృందానికి వ‌చ్చిన ఈ విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్రకారం... సుశీ మీడియా ప్రయివేటు లిమిటెడ్ పేరుతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆధ్వ‌ర్యంలో 2017 ఏప్రిల్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలో న్యూస్ ఛానల్ రానుంది. ఈ చాన‌ల్ సీఈఓగా సాక్షి - జీటీవీ - ఏ టీవీ వంటి ఛాన‌ల్ల‌లో ప‌నిచేసిన‌ గోవిందరెడ్డి బాధ్య‌తలు స్వీకరించనున్నారు. సుశీ మీడియా ప్రయివేటు లిమిటెడ్ కార్యాలయంలో ఛాన‌ల్ ప్రారంభానికి త‌గిన విధంగా స్టూడియోల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ ప‌రిణామంతో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఛాన‌ల్ లేద‌నే లోటు తీర‌నుంది. అదే స‌మ‌యంలో మొన్న‌టి వ‌ర‌కు అనుకూలంగా ఉన్న వీ6 ఛాన‌ల్ దూర‌మవ‌డం వ‌ల్ల క‌లిగిన వెలితి కూడా పోనుంద‌ని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/