Begin typing your search above and press return to search.
టీపీసీసీ చీఫ్ పదవి పై కీలక ప్రకటన చేసిన కోమటిరెడ్డి
By: Tupaki Desk | 6 Dec 2020 10:18 AM ISTదుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరుస ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఆ పదవి కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది.
ఇప్పటికే అందరికంటే ముందంజలో రేవంత్ రెడ్డి ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేత కావడంతో.. స్వతహాగా కాంగ్రెస్ వాదులకే ఆ పీఠం ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ సీనియర్లలో వ్యక్తమవుతోంది. వారే దీన్ని అడ్డుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో తానే ముందున్నానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. పీసీసీ చీఫ్ ఇస్తే కాంగ్రెస్ శక్తులను ఏకతాటిపైకి తెస్తానని అన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రజల తరుఫున పోరాడుతామని అన్నారు. ఎల్.ఆర్.ఎస్ ప్రజలకు భారంగా మారిందన్నారు. ఈ ఫలితాలు చూసైనా ఎల్.ఆర్.ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వరదసాయం అందనివారికి మళ్లీ రూ.10వేల సాయం చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. వరదసాయం చేయకుంటే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని ఎంపీ కోమటిరెడ్డి హెచ్చరించారు.
కాగా తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు లాబీయింగ్ మొదలుపెట్టారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో అది మరింత హీట్ పెరిగింది.