Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి విషయంలో చీలిపోయిన కోమటిరెడ్డి బ్రదర్స్?

By:  Tupaki Desk   |   13 July 2021 3:50 AM GMT
రేవంత్ రెడ్డి విషయంలో చీలిపోయిన కోమటిరెడ్డి బ్రదర్స్?
X
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించగానే కాంగ్రెస్ లో అసమ్మతి రాజేసి ఇక గాంధీ భవన్ గడప తొక్కను అని అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి శపథం చేశారు. అయితే రాజకీయాల్లో ఈ అన్న బాటలో నడుస్తున్న ఆయన తమ్ముడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా మాత్రం అన్నయ్యను వ్యతిరేకిస్తున్నారు. అన్న కాంగ్రెస్ లో ఉంటే.. తమ్ముడు మాత్రం గెలవగానే బీజేపీకి సపోర్టు చేశారు. బీజేపీతో రాజగోపాల్ రెడ్డి సాన్నిహిత్యంతో నడిచారు. కోమటిరెడ్డి కాంగ్రెస్ లో ఉంటే.. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడూ అసమ్మతి రాజేస్తూ అన్నకు మైనస్ అయ్యేవారు.

తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విషయంలోనూ అదే జరిగింది.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రేవంత్ రెడ్డి కలిసి బుజ్జగించారు. తనకు అనుకూలంగా మలిచారు. అదే సమయంలో అన్న వెంకటరెడ్డి మాత్రం ఇంకా అసమ్మతి రాజేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన కాకరేపిన ఈయన ఇప్పుడు రేవంత్ రాకతో చల్లబడ్డారు. భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కేంద్రం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశఆరు.

కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మూలంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఓడిపోయిందని.. సరైన నాయకత్వం లేకపోవడమే కారణమన్నారు.సోనియా, రాహుల్ గాంధీలు ఏ తప్పు చేయలేదని.. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు తలెత్తుకునేలా చేశారన్నారు. కొంత మంది స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చే విషయంలో కానీ,.. పోరాటం చేసే విషయంలో కానీ సరైన పద్ధతిలో పనిచేయకపోవడంతోనే తెలంగాణ కాంగ్రెస్ బలహీనపడేలా చేశారని మండిపడ్డారు.

గత ఎన్నికల్లో పొత్తుల విషయంలో.. ప్రజాసమస్యల పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడంతోనే ఓడిపోయామన్నారు. అందుకే తాను కాంగ్రెస్ కు దూరం జరిగానని.. విభేదించానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కు భవిష్యత్ లేదన్నానన్నారు.

ఇక రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించడంపైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ‘నేను రేవంత్ రెడ్డిని విమర్శించడం గానీ, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ చేయదలుచుకోలేదన్నారు.

రెండు సంవత్సరాలు పార్టీకి దూరంగా ఉన్న విషయం వాస్తమే కానీ.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.