Begin typing your search above and press return to search.
కల్లబొల్లి కబుర్లు చెబుతున్న కొల్లు
By: Tupaki Desk | 14 Aug 2017 10:03 AM ISTతెలుగుదేశం పార్టీలో మంత్రుల పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే.. తాము కూడా ఏదో ఒక రూపంలో ప్రెస్ మీట్ పెట్టి.. జగన్మోహన రెడ్డిని గనుక తిట్టకపోతే.. ఆయన మీద నిందలు వేయకపోతే.. తమ పార్టీ అధినేత ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారు. తమ పనితీరు సక్రమంగా ఉండడం అంటే దాని అర్థం.. తమ మంత్రిత్వ శాఖను ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నాం, నిజాయితీగా నడుపుతున్నాం అనేది కానే కాదని.. జగన్మోహన రెడ్డిని ఎంత బాగా తిడుతున్నాం అనేది మాత్రమే అని చంద్రబాబు కేబినెట్ మంత్రులు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. నంద్యాల ఎన్నికల విషయంలో తమకు ప్రత్యేక బాధ్యత లేనప్పుడు.. ప్రత్యేకంగా అందులో తల దూర్చకుండా ఇన్నాళ్లూ కామ్ గా ఉన్న మంత్రులు కూడా.. ‘ఈ జగన్ ను తిట్టడం అనే యజ్ఞం నిర్వహించడంలో తాము వెనుకబడిపోతున్నామేమో’ అని భయపడి తిట్లదండకం లంకించుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఈ జాబితాలో చేరిపోతున్నారు.
కానీ కొల్లు రవీంద్ర వేస్తున్న నిందలు మాత్రం చిత్రంగా ఉన్నాయి. నంద్యాల లో ప్రస్తుతం ఉప ఎన్నికలు రావడానికి కేవలం జగన్మోహన రెడ్డే కారణం అని ఆయన నిందిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎవరైనా చనిపోతే.. వారి కుటుంబసభ్యులే గనుక.. ఎన్నికలకు ఆసక్తి చూపితే.. ఇతర పార్టీలు పోటీ పెట్టకపోవడం అనేది రాష్ట్రంలో సాంప్రదాయం అని.. ఈ సాంప్రదాయాన్ని జగన్మోహనరెడ్డి నాశనం చేసేశారని కొల్లు రవీంద్ర ఆరోపిస్తున్నారు. అందువల్లే రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయంటున్నారు.
అయితే ఒక రకంగా చెప్పాలంటే.. నంద్యాల ప్రజల వాయిస్ మరో రకంగా వినిపిస్తోంది. ఈ ఉప ఎన్నిక అనేది అసలు చంద్రబాబునాయుడు వల్లనే వచ్చిందని వాళ్లు అనుకుంటున్నారుట. బూటకపు హామీలు ఇచ్చి భూమా నాగిరెడ్డిని వైసీపీలోంచి తమ పార్టీలోకి తీసుకున్న తరవాత.. చంద్రబాబునాయుడు ఆయన గురించి గానీ.. ఆయన డిమాండు చేస్తున్న నంద్యాల అంశాల గురించి గానీ.. ఏమాత్రం పట్టించుకోలేదని.. నిర్లక్ష్యం చేశారని అందువల్లనే అసలు తమ నాయకుడు భూమా నాగిరెడ్డి మరణించారని అనుకుంటున్నారట. భూమా మరణానికి చంద్రబాబే కారకుడు అనే అభిప్రాయం ఉన్న వారందరిలోనూ ఇలాంటి భావన కలుగుతోందిట. భూమానే ఉంటే ఎన్నికలే వచ్చేవికాదు కదా.. మళ్లీ జగన్ మీద నిందలు వేయడం ఎందుకు అని వారు భావిస్తున్నారంట. పాపం కొల్లు రవీంద్ర గారు.. జగన్ మీద బురద చల్లుదాం అనుకుంటే.. అది కాస్తా తెదేపా మీదికి రివర్స్ అవుతున్నట్లుగా ఉంది.