Begin typing your search above and press return to search.
వలస కూలీ అమ్మ వార్లు.. మనసును కదిలించే విగ్రహాలు
By: Tupaki Desk | 16 Oct 2020 5:40 PM ISTకరోనా మన జీవితాలను ఎలా తలకిందులు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా ఎఫెక్ట్‌కు చిన్నా పెద్ద అని తేడా లేకుండా అన్ని రకాల ఉద్యోగులు ఏదో రకంగా నష్టపోయారు. చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఇక వలసకూలీల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కరోనా ఎఫెక్ట్‌తో అత్యంత దుర్భర జీవితాన్ని అనుభవించింది వలస కూలీలు మాత్రమే. పని దొరకక.. స్వస్థలాలకు వెళ్లలేక వాళ్లు నరకం అనుభవించారు. చంటి పిల్లలను ఎత్తుకున్న తల్లులు, వృద్ధుల పరిస్థితి నిజంగా అగమ్యగోచరంగా మారింది. వలస కూలీల కష్టాలను కళ్లకు కట్టేందుకు ఇప్పటికే ఎందరో కళాకారులు కృషి చేశారు.
కరోనా ఎఫెక్ట్ తో మన దేశంలో సాంస్కృతికంగా కూడా ఎంతో మార్పు వచ్చింది. కరోనా కష్టాలను కళ్లకు కడుతూ మన పండుగులను కూడా జరుపుకుంటున్నాం. ఇప్పటికే వినాయక చవితి సందర్భంగా పలువురు ఔత్సాహిక కళాకారులు, వినాయక మండప నిర్వాహకులు కరోనా కష్టాలను కండ్లకు కట్టేలా విగ్రహాలను తయారు చేయించారు. వినాయకుడు, ఎలుకలను కరోనా డాక్టర్లుగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
త్వరలో విజయదశమి పండుగ రానున్న నేపథ్యంలో బెహలా ప్రాంతానికి చెందిన బారిష క్లబ్ దుర్గా పూజా కమిటీ వినూత్నంగా ఆలోచించింది. చంటి బిడ్డలను ఎత్తుకొని వేల కిలోమీటర్లు నడుస్తున్న మహిళల సందర్భాన్ని గుర్తుచేస్తూ అటువంటి విగ్రహాలను తయారు చేయించింది. ఇప్పుడు ఆ విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి.
బిడ్డల కోసం కష్టపడే తల్లులు కూడా అమ్మవార్లతోనే సమానం అని తెలియజేసేందుకు ఇటువంటి విగ్రహాలను తయారు చేయిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దసరా వస్తోందంటే చాలు అమ్మవారి విగ్రహాలను తయారుచేసే కార్మికులు నెలల నుంచే తమ పనుల్లో బిజీ బిజీ అయిపోతారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో దసరా పండుగ అంగరంగ వైభోగంగా జరుపుకుంటారు. బెంగాల్ రాజధాని కలకత్తా అంటే కాళీకాదేవి అమ్మవారే గుర్తుకొస్తారు. దసరాకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ వీధిలో కాళికాదేవి విగ్రహాలు దర్శనం ఇస్తాయి. నవరాత్రులు అమ్మవారికి పూజలు చేసి నిమజ్జనం చేస్తారు. కరోనా కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఏడాది మాత్రం బెంగాల్ ప్రజలు భిన్నంగా ఆలోచించారు.