Begin typing your search above and press return to search.
మీ ఆయన ఫామ్‌లో లేడు.. మీరు దుబాయ్ వెళ్లండి ప్లీజ్.. రసెల్ భార్యకు మెసేజ్
By: Tupaki Desk | 9 Oct 2020 11:15 AM ISTఐపీఎల్ జరిగిన ప్రతిసారి క్రికెటర్ల భార్యలను బయటకు లాగడం కామన్‌గా మారిపోయింది. ఇప్పటికే కోహ్లీ సరిగ్గా ఆడటం లేదంటూ ప్రముఖ కామెంటర్ సునీల్ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడో అభిమాని చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆండ్రీ రస్సెల్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. నిజానికి రస్సెల్ ఆల్‌రౌండర్.. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లోనూ భయంకరంగా రాణించగలడు. అయితే ప్రస్తుత సీజన్‌లో రస్సెల్ కొంత ఫామ్ కోల్పోయాడు. ఈ సీజన్‌లో బౌలింగ్‌లో బాగానే రాణిస్తున్నప్పటికీ బ్యాటింగ్ లో తేలి పోతున్నాడు. తన సామర్థ్యానికి తగినట్టుగా ఆడట్లేదు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా అయిదు మ్యాచ్‌లను ఆడిన ఆండ్రీ రస్సెల్.. 50 పరుగులు మాత్రమే చేశాడు. అతని అత్యధిక స్కోరు 24. బ్యాటింగ్ సగటు 12.50 మాత్రమే. దీంతో రస్సెల్ అభిమానులు, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఏకంగా ఓ ఫ్యాన్ రస్సెల్ భార్య జస్సిమ్ లోరాకు మెసేజ్ పెట్టారు. ఈ మెసేజ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘ఆంటీ రస్సెల్ సరిగ్గా ఆడటం లేదు. మీరు పక్కన లేకపోవడంతో అతడు ఫామ్ కోల్పోయినట్టు ఉన్నాడు. మీరు వెంటనే దుబాయ్ వెళ్లి రస్సెల్‌ను ఉత్సాహపరచండి’ అంటూ సోషల్‌మీడియా ద్వారా మెసేజ్ పెట్టాడు. దీనికి ఆమె కూడా రిప్లయ్ ఇచ్చారు. ‘రస్సెల్ తప్పకుండా ఫామ్‌లోకి వస్తాడు. ఇంకా చాలా మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ముందుముందు రస్సెల్ విజృంభన చూస్తారు’ తాను దుబాయ్ వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆమె పేర్కొన్నారు.
ఫ్యామిలీ లేక డీలా పడుతున్నారా?
ప్రతి ఐపీఎల్ సీజన్‌లో క్రికెటర్ల వెంట వాళ్ల భార్య, పిల్లలు వెళ్తుంటారు. ఈ సారి కరోనాతో ఎవరూ వెళ్లలేకపోయారు. బయో సెక్యూర్ బబుల్ ను విధానంలో ఐపీఎల్ టోర్నమెంట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులకు కూడా అనుమతి లేదు. అయితే భార్యలు లేకపోవడం వల్లే క్రికెటర్లు కొంత డిప్రెషన్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.