Begin typing your search above and press return to search.

కోహ్లీ మనసు ఫ్రేమ్ లో లేదు.. 8 పరుగులపై మాజీల సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   7 Feb 2022 12:30 PM GMT
కోహ్లీ మనసు ఫ్రేమ్ లో లేదు.. 8 పరుగులపై మాజీల సంచలన  వ్యాఖ్యలు
X
భారత దిగ్గజ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ మనసు ఫ్రేమ్ లో లేదంటూ కామెంట్ చేశారు. ఆయన సామర్థ్యాన్ని ప్రశ్నించే ఆస్కారమే లేదని పేర్కొన్నారు. ఇలాంటి సమయాల్లో పొరబాటు ఎక్కడ జరిగిందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బ్యాట్ తో రప్ఫాడించే కోహ్లీ.. కేవలం నాలుగు బంతుల్లో ఎనిమిది పరుగులు చేసి ఔట్ కావడం పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

భారత్ కు ప్రతిష్ఠాత్మకమైన ఈ మ్యాచ్ లో విరాట్ ఆట తీరుపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నాలుగు బంతుల్లో పెవిలియన్ లో చేరడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు ఫోర్లు కొట్టి చివరకు... కెమర్ రోచ్ బౌలింగ్ లో ఔట్ కావడం బాగా లేదని పేర్కొన్నారు. కోహ్లీ ఔట్ అయిన విధానం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ పోరులో విరాట్ హడావిడిగా కనిపించాడని అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికాలో బాగానే ఆడిన కోహ్లీ... ఈ మ్యాచ్ లో చేసిన పరుగులు ఆయన బ్యాటింగ్ సామర్థ్యానికి సరిపోవడం లేదని వ్యాఖ్యానించారు.

వాస్తవానికి పిచ్ పరిస్థితులు కోహ్లీ చాలా బాగా అర్థం చేసుకుంటారు... ఆయన కంటే ఎవరూ బాగా అర్థం చేసుకోలేరని ఆకాష్ అభిప్రాయపడ్డారు. అలాంటి మోదీ స్టేడియం పిచ్ సరిగా అంచనా వేయలేకపోయారా? అని ప్రశ్నించారు. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ... ఇలా ప్రతిష్ఠాత్మక పోరులో 8 పరుగులకే పరిమితం కావడం బాలేదని అన్నారు. అంతేకాకుండా ఆయన మనస్సు ఇప్పుడు సరైన ఫ్రేమ్ లో లేదని కామెంట్ చేశారు.

గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో వెస్టిండీస్, భారత జట్టు మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఇండియాకు ఈ పోరు చాలా ప్రత్యేకం. భారత జట్టు 1000 వన్డే పోరు ఇది కావడం గమనార్హం. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ మ్యాచ్ భారత్ కైవసమైంది. ఆరు వికెట్ల తేడాతో ఉత్కంఠగా సాగి... చివరకు పై చేయిగా నిలిచింది. ఈ పోరులో భారత క్రికెటర్ రోహిత్ శర్మ తనదైన ప్రతిభ చూపారు. టీమ్ కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా రప్ఫాడించారు. రోహిత్ శర్మ అర్ధ సెంచరీ చేసి సత్తా చాటారు.