Begin typing your search above and press return to search.
ధోని రిటైర్మెంట్ పై కోహ్లీ భావోద్వేగం..ఈ బాధ తీర్చలేనిదంటూ ట్వీట్
By: Tupaki Desk | 16 Aug 2020 9:45 AM ISTక్రికెట్ లో తనకు అన్ని తానై నిలిచి కెరీర్ ఆసాంతం అండగా నిలిచిన ధోని రిటైర్మెంట్ తో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలోనే విరాట్ కోహ్లీ జట్టులోకి వచ్చాడు. అతడి ప్రతిభను చూసిన ధోని కోహ్లీని ఎంతగానో ప్రోత్సహించాడు. అన్ని ఫార్మాట్లలో కోహ్లీ తనను తాను నిరూపించుకున్న తర్వాత అతడికి కెప్టెన్గా అవకాశం ఇచ్చేందుకు ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అయితే ధోని కెప్టెన్ గా బాధ్యతల నుంచి తప్పకున్నాడే గానీ మైదానంలో మాత్రం ఎప్పుడూ ధోనీనే కెప్టెన్ లాగా కనిపించేవాడు.
అందుక్కారణం కోహ్లీనే. కోహ్లీ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి ధోనికి ఎంతో గౌరవమిచ్చాడు. ఫీల్డింగ్ సెట్ చేయడంలో, బౌలింగ్ లో మార్పులు, మ్యాచ్ ఎప్పుడు కష్టతరంగా మారినా సరే ధోని సలహాలను కోహ్లీ తీసుకునేవాడు. వారిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ నడిచింది. ఎన్నో సందర్భాల్లో విరాట్ కోహ్లీ నా కెప్టెన్ ధోనీ అంటూ పొగడడం జరిగింది. అలాంటిది ఉన్నట్టుండి ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. 'ప్రతి క్రికెటర్ ఏదో ఒక రోజు తన ప్రయాణాన్ని ముగిస్తారని, అయితే మనకు బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తే ఆ బాధ తీర్చలేనిదని' ధోని రిటైర్మెంట్‌పై కోహ్లీ ట్వీట్ చేశాడు.
దేశం కోసం నువ్వు చేసిన సేవలు అందరి మదిలో చిర స్థాయిగా నిలిచిపోతాయని' కోహ్లీ ట్వీట్ చేశాడు. నీ నుంచి నాకు దక్కిన పరస్పర గౌరవం నాతో ఎప్పటికీ ఉంటుందని, ప్రపంచం నువ్వు అందుకున్న విజయాలను చూస్తోందని..నేను నీ వ్యక్తిత్వాన్ని చూశానని' ధోనీని ఉద్దేశించి కోహ్లీ ట్వీట్ చేశాడు. మరో స్టార్ క్రికెటర్ రైనా రిటైర్మెంట్ పై కూడా కోహ్లీ స్పందించాడు. 'ఇప్పటివరకూ కెరీర్ ను ఉన్నతంగా సాగించావు..నువ్వు మున్ముందు మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నానని' కోహ్లీ ట్వీట్ చేశాడు.