Begin typing your search above and press return to search.

మ‌రో ఎమ్మెల్యే బాబుకు బై చెప్పాడు

By:  Tupaki Desk   |   30 March 2019 1:03 PM IST
మ‌రో ఎమ్మెల్యే బాబుకు బై చెప్పాడు
X
అధికారం కోసం పాకులాడే నాయ‌కులు ఓటేసిన జ‌నాన్ని ఏరోజు ప‌ట్టించుకోరు. గ‌త ప‌దేళ్లుగా జంపింగ్‌ లు త‌మ ప‌ద్ధ‌తి మార్చుకున్నారు. తెలంగాణ‌లో ఓట‌రు సిరా మ‌ర‌క చెర‌గ‌క ముందే అంద‌రూ టీఆర్ ఎస్‌ లో జాయిన్ అవుతున్నారు. అధికార యావ మిన‌హా ఇది మరేమీ కాదు. ప్ర‌తి ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉండాలి, ప‌నులు చేసుకోవాలి అనుకుంటే...ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు ఏంటి?

గ‌తంలో కోడుమూరులో వైసీపీ గుర్తుపై ఎమ్మెల్యే గా గెలిచిన‌ మణిగాంధీ చంద్ర‌బాబు సీఎం అవ‌గానే ఆ పార్టీలో చేరిపోయారు. మ‌ళ్లీ అక్క‌డ ఈసారి టిక్కెట్ ఇవ్వ‌లేదు. కొంత‌కాలం సైలెంట్‌ గా ఉన్న మ‌ణిగాంధీ... మ‌ళ్లీ జగన్ అధికారంలోకి వ‌స్తే ఏంటి ప‌రిస్థితి అని అలోచించారు. అంతే... గ‌తంలో మోసాన్ని మ‌రిచి మ‌ళ్లీ జ‌గ‌న్‌ ను అర్థించారు. అయితే, పాత‌వి మ‌న‌సులో పెట్టుకోకుండా జ‌గ‌న్ ఓకే చెప్పారు.

దీంతో ఎమ్మిగనూరులో జరిగే జగన్ బహిరంగ సభలో మణిగాంధీ వైసీపీ కండువా తిరిగి కప్పుకోనున్నారు.ప్రస్తుతం కోడుమూరులో వైసీపీ అభ్యర్థిగా మణిగాంధీ తోడల్లుడు సుధాకర్ బాబు పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.