Begin typing your search above and press return to search.
గోదావరి జిల్లాలో జోరుగా కోడిపందేలు.. బరులు సిద్ధం
By: Tupaki Desk | 13 Jan 2021 10:45 AM ISTసంక్రాంతి అంటే తెలుగురాష్ట్రాల్లో పెద్ద పండుగ.. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే మరింత గ్రాండ్ గా జరుపుకుంటారు. కోనసీమ ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగుతాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బరులు సిద్ధమయ్యాయి. పోలీసు, రెవెన్యూ అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అధికార పార్టీ నేతల అండదండలతో కోడిపందేల పనులు జరిగిపోతున్నాయి.
మరోవైపు కోర్టుల ఆదేశాలు, పోలీసుల హడావుడి, మైకుల్లో ప్రచారాలు కొన్ని చోట్ల సాగుతున్నాయి. కత్తులు, పుంజుల స్వాధీనం, బరుల ధ్వంసం, నిర్వామకుల అరెస్టులు సాగిపోతున్నాయి.
పండుగ మూడు రోజులూ పందేలు జోరుగా ఏపీలోని జిల్లాల్లో సాగుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు ఇందులో చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో బరులకు సంబంధించిన చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు తగినట్టుగా పందేల బరులూ సిద్ధమైపోతున్నాయి.
ఎన్ని ఆంక్షలున్నా నిర్వాహకులు కోళ్లు, కత్తులు సిద్ధం చేసుకుంటున్నారు. పోలీసులు ధ్వంసం చేసినా మరో చోట బరులు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీఐపీ గేలరీలు, పేకాట క్లబ్ లు, భారీగా మద్యం దుకాణాల ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి.
నూజివీడు, జనార్ధనవరం, కొప్పాక ప్రాంతాల్లో పందేల నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇక భీమవరంలో ఏడేళ్లుగా సంప్రదాయ డింకీ పందేలను ఎంపీ రఘురామకృష్ణం రాజు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈసారి ఆయన రావడం లేదని తెలుస్తోంది.