Begin typing your search above and press return to search.
కోడెల అప్పుడే ఆత్మహత్యకు పాల్పడ్డారా...?
By: Tupaki Desk | 16 Sept 2019 4:52 PM ISTతెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దిగ్గజ నేతగా ఉన్న టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అందరిని షాకుకు గురి చేసింది. పార్టీలకు అతీతంగా ఆయన మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. అయితే కోడెల రెండు వారాల క్రితమే ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని తెలిసింది. పైగా అసెంబ్లీ ఫర్నిచర్ కేసులో కోడెలకు చాలా అవమానం కూడా జరిగింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో కోడెల రెండు వారాల క్రితం నిద్రమాత్రలు మింగి సూసైడ్ కు యత్నించారని తెలుస్తోంది. కాకపోతే అప్పుడు కుటుంబ సభ్యులు వెంటనే తెలుసుకుని కోడెలని ఆసుపత్రికి తీసుకెళ్ళడంతో ప్రాణాలు దక్కాయని అంటున్నారు. కానీ ఈసారి ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు కుటుంబ సభ్యులు గుర్తించేసరికి ఆలస్యమైపోయింది. దీంతో దిగ్గజ నేత ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఆయన ఆత్మహత్యపై పలు రకాల అనుమానాలు ఉన్నాయి. ఎంతో డేర్ & డ్యాషింగ్ గా ఉండే కోడెల ఆత్మహత్య చేసుకోవడం ఏంటని చాలామంది షాక్ కు గురవతున్నారు. ఒకవేళ కేసుల విషయంలోనే ఒత్తిడికి గురవతున్నారు అనుకుంటే...గతంలో ఇంతకంటే ఎక్కువగానే ఈయనపైనా ఆరోపణలు వచ్చాయి. మరి అలా ధైర్యంగా నిలబడిన కోడెల ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి ? అని పోలీసులు విచారణ చేస్తున్నారు. వైద్యుల నుంచి పోస్టుమార్టం రిపోర్టు రాగానే అసలు విషయం చెబుతామంటున్నారు.