Begin typing your search above and press return to search.

స్పీక‌ర్‌ కు-సీనియ‌ర్ మంత్రికి ఎందుకు ప‌డ‌ట్లేదు?

By:  Tupaki Desk   |   6 Jan 2016 4:59 AM GMT
స్పీక‌ర్‌ కు-సీనియ‌ర్ మంత్రికి ఎందుకు ప‌డ‌ట్లేదు?
X
రాజ‌కీయాల్లో నాయ‌కులు సీనియ‌ర్‌ లు అవుతున్నా కొద్ది వాళ్ల‌కు అదే స్థాయిలో గౌర‌వం ద‌క్కాల‌నే ఆకాంక్ష కూడా ఉంటుంది. త‌మ మ‌న‌సు నొప్పించే విధంగా ఏం జ‌రిగినా స‌హించ‌లేరు స‌రికదా అలాంటి ప‌రిస్థితి ఎదురవుతున్న‌ట్లు అనిపించినా ఇబ్బందిప‌డుతుంటారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్‌ కు - సీనియ‌ర్ మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడుకు మ‌ధ్య ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొని ఉంద‌ని అంటున్నారు.

స్వరాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స‌మావేశాలు నిర్వహించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు పట్టుదలతో ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందూ ఈ ప్రస్తావన రాగా ఆ స‌మ‌యంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేయాలని స్పీక‌ర్‌ అనుకున్నారు. స్వయంగా ఆ ప్రాంగణాన్ని సందర్శించి సదుపాయాలను పరిశీలించారు. అయితే సీఎం చంద్రబాబు సుముఖత తెలపలేదు. ఇలా అసెంబ్లీ సమావేశాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా గుంటూరు జిల్లాలోనే ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష వ్యక్తమవుతున్న‌ప్ప‌టికీ.... బడ్జెట్‌ సమావేశాలు వైజాగ్‌ లో జరపాలని భావిస్తున్నట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి య‌న‌మ‌ల ప్ర‌క‌ట‌న చేసినట్లు వార్తలు వ‌చ్చాయి. దీంతో ఈ విషయంలో యనమల తనతో సంప్రదించకుండా ప్రకటన చేశారని స్పీకర్ నొచ్చుకున్న‌ట్లు రాజకీయవర్గాలలో చర్చ సాగుతోంది.

అయితే బడ్జెట్‌ సమావేశాలను స్వరాష్ట్రంలోనే జరిపేందుకు స్పీకర్‌ చేసిన ప్రతిపాదనను సీఎం చంద్ర‌బాబు అంగీకరించినట్లు తెలిసింది. ఖర్చు ఎక్కువ కాకుండా చూసుకోవాలని సూచించారని సమాచారం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శి - చీఫ్‌ మార్షల్స్‌ తో కూడిన బృందం మంగళగిరి సమీపంలోని హాయ్‌ ల్యాండ్‌ ను ఈనెల ఒకటి, రెండు తేదీల్లో సందర్శించింది. ఈ బృందం హైదరాబాద్‌ లో స్పీకర్‌ కోడెలకు నివేదిక సమర్పించింది. బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి నిర్వహించే అవకాశముంది. ఈ ద‌ఫా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అసెంబ్లీ సమావేశాలను హాయ్‌ లాండ్‌ లోనే నిర్వహించాలని స్పీకర్‌ భావిస్తున్నట్లు సమాచారం.