Begin typing your search above and press return to search.

పార్టీ విలీనంపై కోదండ‌రాం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   28 March 2022 3:45 PM GMT
పార్టీ విలీనంపై కోదండ‌రాం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
X
తెలంగాణ ఉద్య‌మంలో మేధావుల‌ను కూడ‌గ‌ట్టిన ప్రొఫెస‌ర్ కోదండ‌రాం.. త‌ర్వాత‌.. కాలంలో కేసీఆర్‌తో విభేదించి దూర‌మ‌య్యా రు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసినా.. ప్ర‌యోజ‌నం ల‌భించ‌లేదు. ఇక‌.. అప్ప‌టి నుంచి సైలెంట్‌గానే ఉంటున్నారు. అయితే.. ఆయ‌న పార్టీని త్వ‌ర‌లోనే బీజేపీలో క‌లిపేస్తార‌ని.. కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. ఆయ‌న కూడా బీజేపీ కండువా క‌ప్పుకొనేందుకు రెడీ అవుతున్నార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కోదండ రాం.. స్పందించారు.

తెలంగాణ జనసమితిని ఏ పార్టీలోనూ విలీనం చేసే యోచనలో లేమని పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు, కృష్ణా జలాల పరిరక్షణ, విద్యుత్‌ ఛార్జీల పెంపు తదితరాలపై పోరాటాలు సాగిస్తామని వెల్లడించారు. త్వరలో రైతు రక్షణ పేరిట యాత్ర చేపడతామన్నారు.

కేసీఆర్ అసమర్థపాలనే విద్యుత్‌ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని కోదండరాం మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో విచిత్ర ప్రకటనలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఏప్రిల్ 9న తెలంగాణ జ‌న‌స‌మితి.. కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. ప్ర‌భుత్వంపై పోరుకు వెనుకాడేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. ప్ర‌తి విష‌యంలోనూ.. ప్ర‌జ‌ల ప‌క్షానే నిలుస్తామ‌ని.. కోదండ రాం స్ప‌ష్టం చేశారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతోపాటు విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నామని కోదండరాం పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు, కృష్ణా జలాల పరిరక్షణ, విద్యుత్‌ ఛార్జీల పెంపు తదితరాలపై పోరాటాలు సాగిస్తామని వెల్లడించారు. రైతు రక్షణ పేరుతో యాత్ర చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై కలిసి వచ్చే వారితో కలిసి ఉద్యమాలు చేయాలని నిర్ణయించామన్నారు. పార్టీ విలీనం గురించి చర్చ జరగలేదని కోదండరాం స్పష్టం చేశారు.

పోడు సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. రైతు రక్షణ పేరుతో యాత్ర చేయాలని నిర్ణయించాం.పెద్ద మొత్తంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం ఇదే తొలిసారి. ప్రభుత్వ అసమర్థత వల్ల విద్యుత్ రంగం సంక్షోభంలో పడింది. ధాన్యంపై కేంద్రం, రాష్ట్ర కూర్చొని మాట్లాడుకోవాలి. పరస్పర ఆరోపణలతో సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. ఏప్రిల్ 9న మా కార్యాచరణ ప్రకటిస్తాం. కలిసి వచ్చే వారితో కలిసి ఉద్యమాలు చేస్తాం. పార్టీ విలీనం గురించి చర్చలు జరగలేదు.. అని కోదండ‌రాం వెల్ల‌డించారు.