Begin typing your search above and press return to search.

కోదండం సారే తిరుగుతుంటే.. మీరేంది రాణిరుద్రమ?

By:  Tupaki Desk   |   13 Oct 2020 11:45 AM IST
కోదండం సారే తిరుగుతుంటే.. మీరేంది రాణిరుద్రమ?
X
తెలంగాణలో త్వరలో జరిగే పట్టభద్రుల ఉప ఎన్నిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతకు మించిన హీట్ జనరేట్ చేస్తోంది. తనకు అస్సలు కొరుకుడుపడని పట్టభధ్రుల ఎన్నిక సంగతి చూడాలని తెలంగాణ అధికారపక్షం పట్టుదలతో ఉంటే.. ఈస్థానాల వరకు మావే.. టీఆర్ఎస్ కు ఇచ్చే ప్రసక్తే లేదన్నట్లుగా పలువురు పోటీ పడుతున్నారు. చివరకు ఈ ఎన్నికల్లో కోదండం మాష్టారు కూడా బరిలోకి దిగనున్న వైనం తెలిసిందే.

తెలంగాణ ఉద్యమ వేళ.. తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకొని.. నాటి రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం గడగడలాడించిన కోదండం మాష్టారికి సొంత రాష్ట్రంలో పరిస్థితి ఎంతలా మారిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను గెలవాలన్న పట్టుదలతో ఉన్న ఆయన.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానన్న మాట చెప్పిన నేతలందరి ఇళ్లకు.. ఆఫీసులకు వెళ్లి.. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.

కోదండం సారు లాంటి పెద్ద మనిషి స్వయంగా వచ్చి అడిగితే..గతంలో ఏమైనా ఓకే అనేవారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఆయన ముఖం మీదనే సాధ్యం కాదని తేల్చేస్తున్నారు. ఇలాంటివేళ.. ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీవీ జర్నలిస్టుగా సుపరిచితురాలు రాణిరుద్రమ తెలుసు కదా? తాజాగా ఆమె పట్టభద్రుల ఎన్నికల్లో తన సత్తా చాటాలని భావిస్తున్నారు.

ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న ఆమె.. కోదండం మాష్టారి నోటి నుంచి మాట రాలేని రీతిలో ఒక రిక్వెస్టు చేశారు. తాను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని... తనకు మద్దతు ఇచ్చి.. బలపర్చాలని ఆమె కోరుతున్నారు. సీఎం కేసీఆర్ కు అమ్ముడుబోతున్న కొన్ని పార్టీల నేతల్ని నమ్మి మోసపోవద్దంటూ ఆమె సలహా ఇస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని అందరి నేతల ఇళ్లకు సారు వెళుతుంటే.. ఆయన మద్దతు కావాలంటూ రాణి రుద్రమ రిక్వెస్టు ఇప్ప్డడు ఆసక్తికరంగా మారింది.