Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆఫీసుపై కోదండ‌రాం ప్ర‌శ్న‌

By:  Tupaki Desk   |   28 Nov 2016 10:32 AM GMT
కేసీఆర్ ఆఫీసుపై కోదండ‌రాం ప్ర‌శ్న‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నూత‌న క్యాంపు కార్యాల‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌పై జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండరాం ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.ముఖ్య‌మంత్రికి ఇప్ప‌టికే ఒక నివాసం ఉండ‌గా...మరో క్యాంపు కార్యాల‌యం అవ‌సరం లేదని అన్నారు. ఒక‌వేళ ప్రస్తుతం ఉన్న బంగ్లా సరిపోకపోతే మరో బ్లాక్ నిర్మించవలసింద‌ని కోదండ‌రాం సూచించారు. ఒక్క ఏడాదిలోనే ఇంత పెద్ద క్యాంపు ఆఫీసు క‌ట్టిన టీఆర్ ఎస్‌ ప్రభుత్వానికి... పేద‌ల‌కు అవ‌స‌ర‌మైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు కట్టడంలో ఆలస్యం ఎందుకు అవుతుంద‌ని కోదండ‌రాం సూటిగా ప్ర‌శ్నించారు.

కాగా ఈ నెల 30 న భూ నిర్వాసితుల సదస్సు నిర్వహిస్తున్నాన‌మ‌ని కోదండ‌రాం ప్ర‌క‌టించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సద‌స్సుకు తెలంగాణ‌ రాష్ట్రంలోని ఆయా ప్రాజెక్టుల‌తో భూమి కోల్పోయిన వారంతా హాజ‌రుకానున్నార‌ని కోదండ‌రాం తెలిపారు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌ - కాళేశ్వరం ఎత్తిపోత‌ల ప‌థ‌కం - సింగ‌రేణి ఓపెన్ కాస్ట్ నిర్వాసితులు - మెద‌క్‌ లోని నిమ్జ్ నిర్వాసితులు - పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్వాసితుల‌ను పిలుస్తున్నామ‌ని వివ‌రించారు. భూ నిర్వాసితుల గురించి మాట్లాడితే అభివృద్ధి నిరోదకు లు అనే భావనను ప్రభుత్వం వీడాల‌ని కోదండ‌రాం ఈ సంద‌ర్భంగా ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వానికి సూచించారు. భూములు క‌లిగి ఉన్న వారి సమస్యలు వినకుండా భూములు లాక్కొ వడం సరికాదని కోదండరాం అభిప్రాయ‌ప‌డ్డారు. భూ నిర్వాసితుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకుపోతామ‌ని చెప్పారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/