Begin typing your search above and press return to search.

అలా చేసింటే తిరుపతిలో 90కిపైగా పోలింగ్ శాతం నమోదయ్యేది : మంత్రి

By:  Tupaki Desk   |   19 April 2021 4:01 PM IST
అలా చేసింటే  తిరుపతిలో 90కిపైగా పోలింగ్ శాతం నమోదయ్యేది : మంత్రి
X
తాజాగా ఏపీలో తిరుపతి లోక్ సభ కి ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 17 వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. అయితే , ఈ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసుకున్నారు అంటూ టీడీపీ , బీజేపీ వైసీపీ పై ఆరోపణలు చేస్తుంది. దీనితో తాజాగా ఈ వ్యవహారం పై ఏపీ రాష్ట్ర సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు పడలేదని అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో చంద్రబాబునాయుడు చెప్పినట్టుగా బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేస్తే 80 నుండి 90 శాతం పోలింగ్ శాతం నమోదయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుపతి ఎన్నికలలో వైసిపి ఖచ్చితంగా గెలుస్తుంది.... 4 లక్షల 50 వేల మెజారిటీతో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కొడాలి నాని. కరోనా నియంత్రణకు లాక్ డౌన్ పరిష్కారం కాదని.. ప్రజలు మాస్కులు ధరించి శానిటైజర్ వాడాలని, సామాజిక దూరం పాటించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలాగే తెలంగాణలో షర్మిల పెట్టబోయే పార్టీపై తాను మాట్లాడను అని అన్నారు. ఈ నెల 17వ తేదీన తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు వేసిందని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ విషయమై బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తిరుపతికి తరలించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.అటు బిజేపి కూడా ఇదే వాదనను వినిపిస్తోంది.