Begin typing your search above and press return to search.

కొడాలి నాని వర్సెస్ లోకేష్.. దమ్ముందా బాబూ?

By:  Tupaki Desk   |   1 Aug 2020 4:00 PM IST
కొడాలి నాని వర్సెస్ లోకేష్.. దమ్ముందా బాబూ?
X
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేసిన తర్వాత చంద్రబాబు , టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడడంపై మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. దమ్ముంటే రాజీనామా చేయించు బాబూ అంటూ తొడగొట్టాడు.

చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయనకు ఉన్న 20మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. ఉప ఎన్నికల్లో 20కి 20 సీట్లు గెలిస్తే ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణపై పునరాలోచన చేసే అవకాశం ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ఒకవేళ ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఇక చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ ను కూడా కొడాలి నాని టార్గెట్ చేశారు. అసలు అమరావతిలో చంద్రబాబుకు మద్దతే లేదని.. ఎందుకంటే కృష్ణ, గుంటూరు ప్రజలు కూడా చంద్రబాబు చేసిన మోసం గ్రహించి లోకేష్ ను ఓడించారని కొడాలి నాని సంచలన విమర్శలు చేశారు.

లోకేష్ ఓటమిపై నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే అమరావతి పేరిట చంద్రబాబు చేస్తున్న ఈ మొత్తం యాగి వెనుక కృష్ణ, గుంటూరు ప్రజలు, రైతులు ఉన్నారని చంద్రబాబు చెబుతున్నారు. కానీ వారే ఉంటే లోకేష్ ఓడిపోయి ఉండేవాడు కాదు కదా అన్న కొడాలి నాని డైలాగ్ బాగా పేలింది. సో రాజీనామాలు చేస్తే తేలుతుందన్న కొడాలి నాని సవాల్ ను చంద్రబాబు, లోకేష్ స్వీకరిస్తారో లేదో చూడాలి మరీ.