Begin typing your search above and press return to search.
భరత్ అనే నేను.. జరిమానాలు అందుకే తీసుకొచ్చారట!
By: Tupaki Desk | 24 Oct 2020 11:30 AM ISTసినిమాల్లో వచ్చే కొన్ని సీన్లను చూసినంతనే రోమాంచితం కావటమే కాదు.. ఇలాంటివి రీల్ లైఫ్ లోనేనా? రియల్ లైఫ్ లో ఎందుకు ఉండవన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఏదైనా ప్రభుత్వం కాస్త చొరవ తీసుకొని.. ప్రజలకు మేలు చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంటే.. పనికిమాలిన రాజకీయాల్ని తెర మీదకు తీసుకొస్తుంటారు. తాజాగా అలాంటిదే ఏపీలో మొదలైంది. భరత్ అనే నేను.. సినిమాలో మాదిరి.. వాహనదారులు చేసే తప్పులకు భారీగా జరిమానాలు విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
నిర్లక్ష్యం.. మితిమీరిన వేగం.. అత్యుత్సాహం.. సాహసం పేరుతో చేసే వాహనదారుల చేష్టలు ప్రాణాల మీదకు తీసుకురావటమే కాదు.. బాధిత కుటుంబాల్ని మళ్లీ కోలుకోలేని రీతిలో దెబ్బ తీస్తుంటాయి. అంతకంతకూ పెరిగిపోతున్న వాహన ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు వీలుగా ఏపీ సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. తప్పులు చేసే వాహనదారులకు దిమ్మ తిరిగిపోయేలా ఫైన్లు వేయాలన్న నిర్ణయానికి చట్టబద్ధత తీసుకొచ్చారు.
హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాన్ని నడపటం.. మితిమీరిన వేగంతో పాటు..వాహనాలకు బీమా చేయించకపోవటం లాంటి వాటికి భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఈ భారీ జరిమానాల్ని పలువురు స్వాగతించగా.. విపక్ష నేతలు మాత్రం పస లేని వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. జరిమానాల రూపంలో భారీ ఆదాయాన్ని కొల్లగొట్టేందుకే ప్రభుత్వం ఈ తరహా నిర్ణయాన్ని తీసుకొచ్చినట్లుగా వారు విమర్శలు చేస్తున్నారు.
ఇలాంటివేళ.. ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని సీన్లోకి వచ్చారు. విపక్షాలు చేస్తున్న విమర్శల్ని తిప్పి కొడుతూ.. తాము తీసుకున్న నిర్ణయం వెనుక అసలు విషయాన్ని వెల్లడించారు. వాహనదారుల్లో నిర్లక్ష్యం తగ్గించటానికి.. ప్రాణం విలువ తెలియజేయటానికి.. రెడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టేందుకు వీలుగా నిర్ణయాల్ని తీసుకున్నట్లు చెప్పారు. హెల్మెట్ ధరించని వారికి రూ.వంద ఫైన్ వేస్తే మార్పు రాదని.. కానీ వెయ్యి రూపాయిలు విధిస్తే జాగ్రత్త వచ్చే వీలుందన్నారు.
చిన్న చిన్న తప్పులతో ప్రాణాల్ని పోగొట్టుకునే వరకు రాకూడదనే ఫైన్లను భారీగా పెంచేశామన్నారు. తాజాగా పెంచిన ఫైన్లతో సొమ్ము చేసుకోవాలన్నదే ప్రభుత్వ ఆలోచన అంటూ చేస్తున్న విమర్శలు ఏ మాత్రం సరికావన్నారు. ఫీజుల పెంపుతో ఏడాదికి వచ్చే ఆదాయం రూ.150 కోట్లు మాత్రమేనని.. ఏడాదికి రూ.65వేల కోట్లతో సంక్షేమ పథకాల్ని అమలు చేసే ప్రభుత్వానికి ఈపాటి ఆదాయం ఒక్క లెక్కలోనిది కాదన్నారు. కేవలం.. ప్రజల కోసం.. వారి విలువైన ప్రాణాల విషయంలో మరింత జాగ్రత్తను తీసుకొచ్చేందుకే తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. తరచి చూస్తే.. మంత్రి పేర్ని నాని మాటల్లో నిజం ఉందని చెప్పక తప్పదు.