Begin typing your search above and press return to search.
చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 23 Sept 2020 10:15 AM ISTటీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మాట్లాడిన నాని ‘తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని చంద్రబాబు హిందువా? ఎడమ చేత్తో భూమి పూజ చేసిన చంద్రబాబు దంపతులు హిందువులా? చంద్రబాబు ఏనాడైనా తిరుమలలో గుండు కొట్టించుకున్నారా’ అంటూ మంత్రి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనపై నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు బూట్లు వేసుకొని తిరుమల కొండ ఎక్కితే.. సీఎం జగన్ చెప్పులు లేకుండా తిరుమల కొండ ఎక్కారని నాని గుర్తు చేశారు.
సీఎం జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరుమల వెళ్తున్నారని.. ఆయన చాలా సార్లు వెళ్లారు.. వెళ్తారు.. టీడీపీ, బీజేపీ పార్టీలు హిందూ పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారు.. జగన్ కు అన్ని మతాలు, కులాలు ఒక్కటే.. నా మెడలో అన్ని మతాల దండలు వేసుకుంటాను. నాకు అన్ని మతాల ప్రజలు ఓట్లేస్తేనే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను’ అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించాను.
తాను ఏనాడు దేవుళ్లను కించపరచలేదని.. ఆంజనేయస్వామిపై ఒకటి మాట్లాడితే.. టీడీపీ మరొకటి దుష్ప్రచారం చేస్తోందని మంత్రి నాని ధ్వజమెత్తారు.