Begin typing your search above and press return to search.
మోడీ కాలర్ పట్టుకోవాలి అంట.. ఏపీ మంత్రి
By: Tupaki Desk | 20 March 2021 8:50 PM ISTవివాదాస్పద వ్యాఖ్యలతో కాక రేపే ఏపీ మంత్రి కొడాలి నాని ఈసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి లోకేష్ కు సవాల్ చేశాడు.. మోడీని అనడానికి జగన్, మంత్రులందరూ ఒకింత భయపడుతున్న వేళ మంత్రి కొడాలి నాని మాత్రం నిర్భయంగా మోడీపై కామెంట్ చేయడం దుమారం రేపింది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని విశాఖ ప్రాంత వాసులు కోరుతున్నారని.. అది ప్రభుత్వం చేతిలోనే ఉండాలని చెప్పి ఆ ప్రజలంతా కోరుకుంటున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతల లోకేష్ కు సంచలన సవాల్ చేశారు.
‘మీకు దైర్యం ఉంటే ప్రధాని మోడీని ప్రశ్నించాలని’ టీడీపీ నేత లోకేష్ ను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మేరు ఊరుకోమని ప్రధానిని హెచ్చరించాలని సూచించారు. దమ్ముంటే మోడీ కాలర్ పట్టుకొని అడగాలని సవాల్ చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని.. ఆ ప్రైవేటీకరణ విషయంలో జగన్ సర్కార్ పై నిందలు వేయవద్దని స్పష్టం చేశారు.