Begin typing your search above and press return to search.

కిస్ ఆఫ్ ల‌వ్ రాహుల్ సెక్స్ రాకెట్ న‌డిపేవాడా?

By:  Tupaki Desk   |   18 Nov 2015 9:15 AM GMT
కిస్ ఆఫ్ ల‌వ్ రాహుల్ సెక్స్ రాకెట్ న‌డిపేవాడా?
X
ఆ మ‌ధ్య దేశంలోని న‌గ‌రాల్లో కిస్ ఆఫ్ ల‌వ్ అంటూ పెద్ద ఉద్య‌మ‌మే న‌డిచింది. కేర‌ళ‌లోని కోజికోడ్ లో ప్రేమ జంట‌లున్న కాఫీషాపును కొంద‌రు ధ్వంసం చేయ‌టంతో.. కిస్ ఆఫ్ ల‌వ్ అంటూ ఒక ఉద్య‌మాన్ని మొద‌లెట్టాడు. దీన్లో భాగంగా జంట‌లు బ‌హిరంగంగా ముద్దులు పెట్టుకోవ‌టం ఈ ఉద్య‌మంలో అస‌లు పాయింట్‌. ఈ విధానం ప‌లువురిని ఆక‌ర్షించి.. వారు సైతం రోడ్ల మీద‌కు వ‌చ్చేసి కిస్ ఆఫ్ ల‌వ్ అంటూ త‌మ ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శించ‌టం.. దీన్ని సంప్ర‌దాయవాదులు ఖండించ‌టం లాంటి ఘ‌ట‌న‌లో వ్య‌వ‌హారం ఉద్రిక్తంగా మారింది.

అయితే.. ఈ కిస్ అఫ్ ల‌వ్ అన్న కాన్సెప్ట్ ను స్టార్ట్ చేసిన రాహుల్ ప‌శుప‌ల‌న్‌.. ఆయ‌న స‌తీమ‌ణి రేష్మీ ఆర్ నాయ‌ర్ ఇద్ద‌రి మీద స‌రికొత్త ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట్ కావ‌టం సంచ‌ల‌నంగా మారింది. వారిద్ద‌రూ ఆన్ లైన్ సెక్స్ రాకెట్ న‌డుపుతుంటార‌ని పోలీసులు చెబుతున్నారు. ప‌క్కా ఆధారాల‌తో ఈ జంట‌ను కేర‌ళ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కేర‌ళ రాష్ట్రంలో ఆన్‌ లైన్ సెక్స్ రాకెట్ న‌డుపుతున్న‌ట్లుగా వారు చెబుతున్నారు.

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన కిస్ ఆఫ్ ల‌వ్ ఉద్య‌మ‌క‌ర్త‌.. తాజాగా ఆన్ లైన్ సెక్స్ రాకెట్ లో బుక్ కావ‌టం ప‌లువురిని విస్మ‌యానికి గురి చేస్తుంది. ఈ సెక్స్ రాకెట్ కు సంబంధించి కేర‌ళ పోలీసులు రాహుల్‌.. ఆయ‌న స‌తీమ‌ణితో పాటు మ‌రో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిపై కేసు న‌మోదు చేశారు.