Begin typing your search above and press return to search.
కేసీఆర్ ను ఇరకాటంలో పడేసిన కోదండరాం
By: Tupaki Desk | 13 Jan 2016 3:26 PM ISTముద్దసాని కోదండరామ్ రెడ్డి. ఈ పూర్తి పేరు కంటే ప్రొఫెసర్ కోదండరామ్ పేరుతో పాపులర్ అయిన వ్యక్తి తెలంగాణ జేఏసీ రథసారథి కోదండరామ్. తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలను ఏకం చేసి జేఏసీ ప్రారంభించి విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లిన కోదండరాం రాష్ర్టం ఆవిర్భవించిన తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఇదేసమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆయన్ను వీలైనంత దూరం పెడుతున్నారు. అయితే ఆ పరిస్థితి కారణంగానే కోదండరాం తెలంగాణ ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేశారు.
జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచార వ్యూహాలను ఖరారు చేసేందుకు టీడీపీ - బీజేపీ నేతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును హైదరాబాద్ లో కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో సత్తాచాటుతామని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులే తమ విజయ ధీమాకు కారణమన్నారు. తెలంగాణలో రాచరిక, రహస్య పాలన సాగుతోందని ఆరోపించారు. నిర్ణయాలు ఏకపక్షంగా మంత్రులకు సైతం తెలియకుండా జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. స్వరాష్ర్టంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో తలెత్తుకొని తిరుగాతామని భావిస్తే....ఆత్మగౌరవానికి అడ్రస్ లేని పరిస్థితులు ఉన్నాయన్నారు. తెలంగాణ కోసం సబ్బండ వర్గాలను కలుపుకొని పోరాడిన కోదండరాం లాంటి ఉద్యమకారులు కనిపించకుండా పోవడమే ఇందుకు నిదర్శనమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ-రాచరిక పాలన తీరును ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళతామని కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిపై హఠాత్తుగా ఇపుడే పుట్టుకువచ్చిన ప్రేమ గురించి కూడా ప్రజలకు వివరిస్తామని అన్నారు. మొత్తంగా టీడీపీ-బీజేపీలు ఏకకాలంలో ఇటు పరిపాలన, తెలంగాణ అంశాల ఆధారంగా టీఆర్ఎస్ పాలనను టార్గెట్ చేస్తూ ముందుకువెళ్లాలని డిసైడ్ అయినట్లు తాజా పరిణామాలు చెప్తున్నాయి.