Begin typing your search above and press return to search.
నల్లారి వారి పెళ్లి కూతురు సిద్ధమయింది
By: Tupaki Desk | 16 Nov 2016 3:16 PM ISTమాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ వచ్చిందని చర్చ సాగుతోంది. కొద్దికాలం క్రితం తమ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలంటూ కిరణ్ వద్ద తన అనుచరులు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా "ఇప్పటికే పెళ్లికి మూహూర్తం కుదిరింది. అయితే పెళ్లి కూతురు పేరు గోప్యం" అంటూ స్టేట్ మెంట్ ఇచ్చి కిరణ్ కుమార్ రెడ్డి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నల్లారి వారి పెళ్లి కుదిరింది. పెళ్లి కూతురు వైసీపీ అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఈ నెల 23న వైసీపీ కండువా కప్పుకోనున్నారని చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి దూరమై, సొంత పార్టీ పెట్టి విఫలమైన కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలి కాలంలో కొద్దిగా యాక్టివ్ అయ్యారు. అందులో భాగంగా వైసీపీ లో చేరి తన పూర్వవైభవాన్ని కొనసాగించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెల 23న తన అనుచరులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికే తనతో పనిచేసిన మాజీ కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపారని, వారిని కూడా వైసీపీ లో చేర్చేందుకు సన్నాహాలు జరిపారని చెప్పుకుంటున్నారు. తాను అనుకున్నట్లు జరిగితే పార్టీలో చేరిన మాజీలు, ఇప్పటికే పార్టీలో ఉన్న ముఖ్యనేతలతో బహిరంగ సభ నిర్వహించాలని కిరణ్ వర్గం భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి వైసీపీ చేరిక ఎంత వరకూ నిజం అవుతుందో వేచి చూడాల్సిందే!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/