Begin typing your search above and press return to search.
బీజేపీ డ్యూటీ ఎక్కిన స్టార్ పొలిటీషియన్
By: Tupaki Desk | 31 May 2023 6:38 PMస్టార్ పొలిటీషియన్.. ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్న విషయం తెలిసిందే. ఆదిలో ఆయన తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో సుమారు 35 సంవత్సరాలు ఉన్నారు. దీంతో అనేక పదవులు ఆయనను వరించాయి. అయితే.. రాష్ట్ర విబజనను తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా..పార్టీ అధిష్టానం తన సూచనలు పరిగణనలోకి తీసుకోలేదని .. చెప్పి. పార్టీ నుంచి బయటకు వచ్చారు.ఈ క్రమంలోనే సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014లో పోటీకి కూడా అభ్యర్థులను నిలిపారు.
కానీ, అందరూ ఓడిపోయారు. తర్వాత.. సుమారు నాలుగేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి.. మళ్లీ కాంగ్రెస్ పిలిచిందంటూ.. ఆ పార్టీలోనే చేరారు. మళ్లీ పార్టీ పరిస్థితి ఎక్కడా పుంజుకునేలా కనిపించడం లేదంటూ.. ఆయన మౌనంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆరు మాసాల కిందట.. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు అయిత.. ఈ ఆరుమాసా ల్లోనూ కర్ణాటక ఎన్నికలు వచ్చాయి. ఒకటి రెండురోజులు అక్కడ పర్యటించి.. బీజేపీకి ఆయన ప్రచారం చేశారు. అయితే.. బీజేపీ ఓడిపోయింది. ఇక, రెండు మూడు రోజుల తర్వాత.. ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు.
ఇదిలావుంటే.. తాజాగా ఆయన ఏపీ రాజకీయాలపై స్పందించారు. త్వరలోనే పార్టీ కార్యక్రమాల్లోపాల్గొంటానని అన్నారు. అయితే.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై కానీ.. సీఎం జగన్‌పై కానీ, ఆయన ఎక్కడా స్పందించలేదు. సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పారు. తనకు ఉన్న బలంతో బీజేపీని బలోపేతం చేస్తానని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇక, ఆయనను ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. సీనియర్ నాయకుడు అయిన.. కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి సూచనలు.. సలహాలు తీసుకునేందుకు తాను ఆయనను కలిసినట్టు సోము చెప్పారు.
ఇదీ.. సంగతి!
వచ్చే 2024 ఎన్నికల నాటికి గౌరవ ప్రదమైన స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కాలని .. ఏపీపై బీజేపీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈక్రమంలో గత ఎన్నికలకు ముందు.. కాపు సామాజిక వర్గానికి వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ.. సోము వీర్రాజును ఇక్కడ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఆయన నేతృత్వంలో వచ్చిన ఎన్నికలు.. అన్నీ కూడా విఫలమయ్యారు.ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి అధ్యక్షుడిని మార్చడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పగ్గాలను కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇవ్వడం ద్వారా.. బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని బీజేపీ వైపు ఆకర్షించి.. వైసీపీఓటు బ్యాంకు కు గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారన వాదన వినిపిస్తోంది. అంటే.. మొత్తంగా.. త్వరలోనే కిరణ్కు బీజేపీ ఏపీ పగ్గాలు అందించడం ఖాయమనే లెక్కలు..సూచనలు వస్తుండడం గమనార్హం.