Begin typing your search above and press return to search.

మాజీ సీఎంతో తమ్ముళ్లు అలా చేశారా?

By:  Tupaki Desk   |   25 Oct 2015 2:44 PM IST
మాజీ సీఎంతో తమ్ముళ్లు అలా చేశారా?
X
ఉమ్మడి రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి మీడియో ప్రముఖంగా వినిపిస్తోంది. రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్న ఆయన.. ఎవరైనా స్నేహితులు.. రాజకీయంగా సీనియర్లు.. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు.. తనకు సన్నిహితులైన వారికి సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమాలకు మాత్రం హాజరవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా చక్రం తిప్పినా.. తనది కాని టైంలో ఏమీ మాట్లాడుకూడదన్న విషయంలో మాత్రం చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు.

మిగిలిన ముఖ్యమంత్రుల కంటే కాస్త భిన్నమైన ధోరణితో వ్యవహరించే ఆయనపై చాలానే చెబుతుంటారు. ఆ విషయాల్ని పక్కన పెడితే.. ఒక్క విషయంలో మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా నిలుస్తారు. తనకు తెలిసిన వారు ఎవరు ఆయన్ని వెళ్లి కలిసినా.. మామూలుగా మాట్లాడతారే తప్పించి.. మాజీ ముఖ్యమంత్రినన్న అహం అస్సలు రానీయ్యరు. కాస్త ఇంట్రావర్ట్ అయినప్పటికీ.. తనను అర్థం చేసుకుంటారన్న నమ్మకం ఉన్న వారి దగ్గర మాత్రం కాస్త ఓపెన్ అయి మాట్లాడుతుంటారు.

మాజీ సీం అన్న అహం నల్లారి మాటల్లో అస్సలు వినిపించదు. తాజాగా శంకుస్థాన విషయంలో ఆహ్వానించటానికి కిరణ్ సమయాన్ని కోరారు. శంకుస్థాపనకు ఇన్విటేషన్ ఇవ్వటానికి మంత్రుల బృందం ఒకటి వస్తుందని చెప్పటంతో ఓకే చెప్పేశారు. మధ్యలో ఏమైందో కానీ.. నల్లారికి ఇన్విటేషన్ ఇవ్వటానికి మంత్రుల టీం కాకుండా చోటా నేతలతో.. ఒక ఎమ్మెల్సీ వెళ్లటంతో ఆయనకు కాలిపోయిందంట. తమ్ముళ్లు తమ వెంట మీడియాను తీసుకెళ్నప్పటికీ.. నల్లారి తన వద్దకు ఎవరినీ రానివ్వలేదంట. మంత్రులు ఇచ్చి ఇన్విటేషన్ ఇస్తారనుకుంటే ఇలా చేశారేమిటని ఆలోచించుకున్నారో ఏమో కానీ ఇన్విటేషన్ ను తీసుకున్నారే కానీ.. ఫోటోలకు ఫోజులు కూడా ఇవ్వలేదు. ఇంటి గుమ్మం దగ్గరున్న ఫోటో గ్రాఫర్లను లోపలకు అనుమతించని ఆయన.. తమ్ముళ్ల మీద కస్సుబస్సు లాడుతూ ఇన్విటేషన్ తీసుకున్నారని చెబుతున్నారు.