Begin typing your search above and press return to search.

రాహుల్‌..బాబు దోస్తీ నాకు షాకింగే!

By:  Tupaki Desk   |   19 Dec 2018 10:35 PM IST
రాహుల్‌..బాబు దోస్తీ నాకు షాకింగే!
X
కాంగ్రెస్ నేత‌ - మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సుదీర్ఘ కాలం త‌ర్వాత వార్త‌ల్లో నిల్చారు. ఇవాళ విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైసీపీ అధినేత జగన్ ఎన్ని రోజులు.. ఎందుకు నడుస్తున్నాడో తనకు అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మైత్రిపై తనకూ ఆశ్చర్యంగానే ఉందని చెప్పారు. యూపీఏ వచ్చి రాహుల్ ప్రధాని అయితే ప్రత్యేక హోదా సహా.. విభజన హామీలు నెరవేరతాయన్న నమ్మకంతోనే చంద్రబాబు.. రాహుల్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. బీజేపీ అన్ని విధాలుగా ఫెయిలైందన్న కిరణ్‌.. విభజన హామీలు నెరవేరాలంటే యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని కవాలన్నారు.

కాంగ్రెస్‌ ను వీడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదని.. పరిస్థితుల ప్రభావం వల్లే అలా జరిగిందని మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు మోడీ - చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ముందు ఎన్డీఏతో చేతులు కలిపి ఆ తరువాత టీడీపీ బయటకు వచ్చిందని.. ఆ విషయంలో చంద్రబాబుదీ తప్పుందని చెప్పారు. కేంద్రంతో కలిసుండీ.. విభజన హామీలు సాధించుకోకపోతే ఫెయిల్యూర్ కాదా.. అని ప్రశ్నించారు. ముందే ఎన్డీఏ నుంచి వైదొలిగితే కేంద్రంపై ఒత్తిడి వచ్చేదన్న ఆయన.. ప్రభుత్వం మెడలు వంచడం - పోరాటాలు చేయడంలో వైసీపీ విఫలమైందన్నారు.