Begin typing your search above and press return to search.

కిర‌ణ్ రాక‌తో జ‌గ‌న్‌ కు పోయేదేం లేద‌న్న‌ట్లే!

By:  Tupaki Desk   |   14 July 2018 11:02 PM IST
కిర‌ణ్ రాక‌తో జ‌గ‌న్‌ కు పోయేదేం లేద‌న్న‌ట్లే!
X
సుదీర్ఘ‌కాలంగా సాగుతున్న చ‌ర్చోప‌చ‌ర్చ‌ల‌కు తెర‌ప‌డి...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్వంతగూటికి చేరారు. ఢిల్లీలో శుక్రవారం కిరణ్‌ కుమార్‌ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ లోకి చేరారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన నివాసంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డికి పార్టీ కండువాకప్పి సాదరంగా స్వాగతించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి అన్యాయం చేసిందని ఆరోపిస్తూ పార్టీ వీడిన మాజీ సీఎం.. మళ్లీ అదే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.అనంతరం ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. 'ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీని - రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరమున్నది. ఇందుకోసం నా శక్తిమేర పనిచేస్తాను' అని అన్నారు. అంతేకాకుండా త‌న‌కు ప‌రిచ‌యమున్న‌ కొద్దిమందిని కాంగ్రెస్ పార్టీలో చేరిపిస్తాన‌ని వెల్ల‌డించారు.

తాను దూషించిన పార్టీలోకే మాజీ సీఎం కిర‌ణ్ రీ ఎంట్రీ - చేరిక‌ల అనంత‌రం ఇలా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌గానే...టీడీపీ అనుకూల వ‌ర్గాల్లో చిత్ర‌మైన విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. కిర‌ణ్ రాక‌తో ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత‌ - వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డికి న‌ష్ట‌మ‌ని జోస్యాలు మొద‌ల‌య్యాయి. కాంగ్రెస్ ఊహించ‌ని రీతిలో బ‌ల‌ప‌డునుంద‌ని, జ‌గ‌న్‌ కు క‌ష్ట‌కాల‌మే అని అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. అయితే, కాంగ్రెస్ రాజ‌కీయాలు - మాజీ సీఎం కిర‌ణ్ పొలిటిక‌ల్ జ‌ర్నీని గ‌మ‌నించిన‌వారు కిర‌ణ్ రీ ఎంట్రీతో జ‌గ‌న్‌ కు జ‌రిగే న‌ష్టం చాలా త‌క్కువ అని చెప్తున్నారు. అస‌లు కిర‌ణ్ ప్ర‌భావం త‌క్కువే అని పేర్కొనే వారు కూడా లేక‌పోలేదు.

ఇందుకు స‌ద‌రు వ‌ర్గాలు చెప్తున్న పాయింట్లు లాజిక‌ల్‌ గా ఉండ‌టం విశేషం. చేరిక స‌మ‌యంలో కిర‌ణ్ మాట్లాడుతూ సొంత తమ్ముడిని టీడీపీలోకి వెళ్లోద్దని సలహా ఇచ్చానని చెప్పుకున్న సంగ‌తి తెలిసిందే. అది గ‌తం అనుకుంటే...ప్ర‌స్తుతం త‌న‌తో పాటు సొంత తమ్ముడినే కాంగ్రెస్ లోకి చేర్పించలేని ఈ నాయకుడు మరో నలభై మంది నాయకులను చిల్లుపడిన కాంగ్రెస్ నావలోకి కప్పగంతులు వేయించ‌గ‌ల‌డా?, ఇతర పార్టీలనుంచి నాయకులను ఎలా తెస్తాడో అంటూ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ``కిరణ్ ఎప్పుడూ ప్రజలలో పని చేయలేదు. కాంగ్రెస్ శ్రేణుల‌తో క‌లిసి ప‌నిచేసిన ఉదంతాలు లేనేలేవు. ముఖ్యమంత్రిగా 3 ఏళ్ళు ఉండి ఈ రాష్ట్రానికి చేసింది చెప్పుకోద‌గ్గ‌ది ఏమీ లేదు. కిర‌ణ్‌ సమర్థుడా కాదా అనే విషయం పక్కన పెడితే మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ లో అనేక సంచ‌ల‌న‌ - వివాదాస్ప‌ద ప‌రిణామాలు జ‌రిగినా ఏదైనా సమస్య గురించి నాలుగేళ్ల‌లో నోరు మెదిపిన పాపాన పోలేదంటున్నారు. ఏవిషయంలో అయినా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తీరును తప్పు అయితే తప్పు అని కాని ఒప్పు అయితే ఒప్పు అని కాని నోరు తెరిచి కనీస అభిప్రాయం చెప్పలేని కిర‌ణ్‌తో..అన్ని అంశాల‌పై స్పందిస్తూ..ప్ర‌జాక్షేత్రంలో ప‌ర్య‌టిస్తున్న జ‌గ‌న్‌కు న‌ష్టం ఎలా జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.