Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో 'కిరణా' లు ఏవీ...!?
By: Tupaki Desk | 9 Aug 2018 11:38 AM ISTరాష్ట్ర విభజనతో అథోగతి పాలైన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకువస్తారని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో పార్టీకి పాత రోజులు వస్తాయని సంబరపడ్డారు. ఆయనను అడ్డం పెట్టుకుని కాంగ్రెప్ నుంచి వెళ్లిపోయిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని భావించారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో పటిష్టమవుతుందనుకున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు ఊహించినవేవి జరగడంలేదు. దీంతో అధిష్టానం - ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలో అందోళనలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్లు ఆయనకు సన్నిహితులు - వారంతా కిరణ్ కుమార్ ద్వారా పార్టీలో చేరుతారని రాహుల్ గాంధీ భావించారు.
తానొకటి తలిస్తే కాంగ్రెస్ మాజీలు మరొకటి తలచినట్లుగా పరిస్థితి ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరి నెల దాటుతున్నా ఆయన చొరవతో ఒక్కరంటే ఒక్కరు కూడా కాంగ్రెస్ లో చేరలేదు. కిరణ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితుడైన మాటల మాంత్రీకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ లో చేరుతారనుకున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి దౌత్యం ఫలించలేదు. ఉండవల్లి నుంచి పార్టీలో చేరికపై ఎలాంటి సంకేతాలు రాలేదు. ఇక సమైక్య ఉద్యమ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డితో కలసి పనిచేసిన ఎన్ జీఓ సంఘ నాయకుడు ఆశోక్ బాబుకు కిరణ్ కుమార్ గేలం వేసారు. ఆయనకు ఫోన్ చేసి కాంగ్రెస్ లో చేరలంటూ ఆహ్వానించారు. అయితే ఆయననుంచి కూడా స్పందన రాలేదు. బొత్సా సత్యనారయణ - ధర్మాన ప్రసాద్ - ఆనం - సబ్బం హరి - కొణతాల రామక్రిష్ణ వంటి వారి సైతం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి తీసుకురావలనుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల గూడుకట్టుకున్న కోపం మరో ఇరవై సంవత్సారాల వరకూ పోదని ఆ నాయకులందరూ చెప్పినట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా - రైల్వే జోన్ ప్రకటిస్తే ప్రజల ఆలోచనలలో మార్పు వస్తుందని ఆ నాయకులు అన్నట్లు తెలిసింది. ఇవన్నీ జరిగిన తర్వాత తమంతట తాముగా కాంగ్రెస్ పార్టీలో చేరుతామని ఆ నాయకులు చెప్పినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్‌లో కిరణ ప్రసారాలు పెద్దగా లేనట్లేనని అంటున్నారు.