Begin typing your search above and press return to search.

బాబుపై పోరాటం చేయ‌మంటున్న మాజీ సీఎం

By:  Tupaki Desk   |   23 Dec 2016 12:53 PM IST
బాబుపై పోరాటం చేయ‌మంటున్న మాజీ సీఎం
X
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌ర్కారుపై మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి కొత్త విశ్లేషణ చేశారు. చంద్ర‌బాబు సార‌థ్యంలోని టీడీపీ ఈ ప్రభుత్వం హామీల ప్రభుత్వమే త‌ప్ప స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించేందుకు జీవోలు విడుద‌ల చేసే ప్రభుత్వం కాదని విమ‌ర్శించారు. అందుకే పోరాటం తీవ్రతరం చేస్తేనే సమస్యలు పరిష్కరమవుతాయని కిర‌ణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన కిర‌ణ్ కుమార్ రెడ్డిని కాంట్రాక్టు లెక్చరర్లు కలిసి 20 రోజులుగా సమ్మె చేస్తున్నామని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోర‌గా కిర‌ణ్ కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్‌ చేస్తామని హామీ ఇచ్చినా పురోగతి లేదని కిర‌ణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని కాంట్రాక్టు ఉద్యోగుల‌తో మాజీ సీఎం చెప్పారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో తన‌వంతు స‌హాయ‌-స‌హ‌కారాలు అందిస్తాన‌ని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన గాడాల - పాలచర్ల మధ్య ఉన్న హర్షకుమార్‌ ఫామ్‌ హౌస్‌ కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ ఆయన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ తో పాటు మాజీ ఎంఎల్‌ ఎలు రౌతు సూర్యప్రకాశరావు - వంగా గీత - ఎపిఐఐసి మాజీ ఛైర్మన్‌ శివరామసుబ్రహ్మణ్యంతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన విలేకరులు పెద్దనోట్ల రద్దుపై స్పందించాలని కోరగా - తాను ప్రస్తుతం రాజకీయాల్లో లేనని - వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినందున రాజకీయాలు మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/