Begin typing your search above and press return to search.

ఇది సృష్టి స్వభావం అంటూ..ఫేక్‌ న్యూస్‌ పోస్ట్‌ చేసిన కిరణ్‌ బేడీ!

By:  Tupaki Desk   |   7 April 2020 2:30 PM IST
ఇది సృష్టి స్వభావం అంటూ..ఫేక్‌ న్యూస్‌ పోస్ట్‌ చేసిన కిరణ్‌ బేడీ!
X
వాట్సాప్ లో ప్రతి రోజు ఎన్నో ఫోటోలు - వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఏవి నిజం ..ఏవి అబద్దం అని తెలుసుకోకుండా కొంతమంది వాటిని ఫార్వర్డ్ చేస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు ప్రముఖులు ఇలాంటి తప్పులు చేస్తుంటారు. అది నిజామా కదా అని పూర్తిగా తెలుసుకోకముందే సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ ..నెటిజన్ల ట్రోల్స్ కు గురౌతుంటారు. తాజాగా ఈ లిస్ట్ లో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ కూడా చేరారు.

ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ అల్లకల్లోలం చేస్తుంది. ఓ వైపు ఈ మహమ్మారి విజృంభిస్తుంటే.. అంతకంటే వేగంగా కరోనా వైరస్‌ పై నకిలీ వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇటీవల కిరణ్‌ బేడి ట్విటర్లో ఓ వీడియో షేర్‌ చేశారు. ఓ ప్రాంతంలో కోడిపిల్లలు గుంపులుగా తిరుగుతున్న వీడియోను షేర్‌ చేస్తూ.. ‘‘కోడిగుడ్డు వల్ల కరోనా వస్తుందన్న మూఢనమ్మకంతో మనం వాటిని పడేస్తున్నాం. అయితే అవన్నీ ఒక వారం తర్వాత పొదిగి ఇలా కోడిపిల్లలు అవుతాయి. ఇది సృష్టి స్వభావం. జీవితానికి దాని సొంత మార్గాలు ఉంటాయి’’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఇక ఈ వీడియో సోషల్‌ మీడియా లో వైరల్‌ అవ్వడం తో కిరణ్‌ బేడీ నకిలీ వీడియోను షేర్‌ చేశాశారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మనం ఉపయోగించే ఎగ్స్‌ ఎలా పొదుగుతాయని నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నకిలీ వార్తలు పోస్ట్‌ చేసేముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. అసలు మీరు వాట్సాప్‌ ను వాడటం మానేయండి అంటూ ఆమె పై సోషల్‌ మీడియా వేదికగా విరుచుకు పడుతున్నారు.