Begin typing your search above and press return to search.

కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ ...ఏపీలో రూ.1,750 కోట్లతో

By:  Tupaki Desk   |   2 Oct 2021 1:01 PM IST
కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ ...ఏపీలో  రూ.1,750 కోట్లతో
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకానుంది. రూ.1,750 కోట్లతో ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ తో పాటు బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్స్‌ ఏర్పాటుచేసేందుకు కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ అయిన సులజ్జ ఫిరోదియా మొత్వాని, సహ వ్యవస్థాపకులు రితేష్‌ మంత్రి శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరించారు. విశాఖలో బ్రాండెడ్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకూ కైనటిక్‌ సంస్థ ప్రతినిధులు ఆసక్తి కనబర్చారు. ఈ సందర్భంగా విశాఖలో బ్రాండెడ్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ నెలకొల్పేందుకు తమ సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు వారు సీఎంకు తెలిపారు.

అలాగే, స్కిల్‌ డెవలప్‌మెంట్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ను కూడా ఏర్పాటుచేయనున్నట్లు కైనెటిక్‌ గ్రీన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పటికే పుణె సమీపంలోని అహ్మద్‌ నగర్‌ లో నెలకు 6,000 ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి సామర్ధ్యంగల ప్లాంట్‌ ని ఈ సంస్థ ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రణాళికలను సీఎం జగన్‌ కు వారు వివరించారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై. శ్రీలక్ష్మి, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జవ్వాది సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.