Begin typing your search above and press return to search.
ఎన్నాళ్లో వేచిన ఉదయం .. ఏడాది తర్వాత మీడియా ముందుకు కిమ్ భార్య !
By: Tupaki Desk | 17 Feb 2021 8:00 PM ISTప్రపంచంలోనే నియంతగా పేరు తెచ్చుకున్న కిమ్ జాంగ్ ఉన్ ఏది చేసినా అదొక వింతే అవుతుంది. ఉత్తర కొరియా లో కిమ్ పాలనలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఎప్పుడు ఎవరు తెర మీదకు వస్తారో.. ఎవరు కనుమరుగవుతారో చెప్పడం చాలా కష్టం. స్వయంగా అధినేత కిమ్ జాంగ్ ఉన్నే చాలా రోజుల పాటు కనమరుగయ్యారు. దాంతో ఆయన చనిపోయాడని ఇక బాధ్యతలు కిమ్ సోదరి చేతిలోకి వెళ్తాయని ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ కొన్ని రోజుల క్రితం కిమ్ తెరమీదకు వచ్చారు.
ఇదిలా ఉండగా కిమ్ భార్య కనిపించి ఏడాది పైనే అవుతోంది. కానీ, ఏడాది తర్వాత కిమ్ జోంగ్ ఉన్ సతీమణి రీ సోల్ జు మీడియా కంటికి చిక్కారు. తన భర్త కిమ్ తో కలిసి మామ దివంగత కిమ్ జోంగ్ ఇల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కిమ్ దంపతులకు సభికులంతా ఘన స్వాగతం పలికారు. గతేడాది జనవరిలో కనిపించిన రి సోల్ జు మళ్లీ ఇప్పుడే దర్శనమిచ్చారు.
ప్యోంగ్యాంగ్ లో ఏర్పాటు చేసిన మామ జయంతి కార్యక్రమంలో భర్తతో కలిసి హాజరైన రి సోల్ జు.. కన్ సర్ట్ ను వీక్షించి ప్రదర్శన కారులను ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నార్త్ కొరియా అధికారిక న్యూస్ పేపర్లో ప్రచురితం అయ్యాయి. కింగ్ జోంగ్ ఇల్ జయంతిని ఉత్తర కొరియా ప్రభుత్వం జాతీయ సెలవు దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
దక్షిణ కొరియా నేషనల్ ఇంటిలిజెన్స్ సర్వీస్ అధికారి ఒకరు రి సోల్ జు క్షేమంగానే ఉన్నారని.. తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. కరోనా కాలం కావడంతో పబ్లిక్ మీటింగ్‌లకు హాజరు కావడం లేదన్నారు. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే కిమ్ భార్య పబ్లిక్‌గా దర్శనమిచ్చి.. అన్ని అనుమానాలను పటాపంచలు చేశారు.