Begin typing your search above and press return to search.

ప్రశాంతంగా నిద్రపోవాలంటే మమ్మల్ని గెలకొద్దు.. అమెరికాకు కిమ్ వార్నింగ్..!

By:  Tupaki Desk   |   16 March 2021 3:09 PM GMT
ప్రశాంతంగా నిద్రపోవాలంటే మమ్మల్ని గెలకొద్దు.. అమెరికాకు కిమ్ వార్నింగ్..!
X
ట్రంప్ ఉన్నంత కాలం వ్యూహాత్మ‌కంగా మౌనం పాటించిన ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్‌.. నూత‌న అధ్య‌క్షుడు బైడెన్ కు నేరుగా హెచ్చ‌రిక‌లు జారీచేశారు. తాజాగా.. ద‌క్షిణ కొరియాతో క‌లిసి అమెరికా యుద్ధ విన్యాసాలు నిర్వ‌హించ‌డం.. కిమ్ కు చెక్ పెట్టేందుకు జ‌పాన్‌, సౌత్ కొరియాతో క‌లిసి ఎత్తులు వేస్తుండ‌డంతో కిమ్ త‌రపున ఆయ‌న సోద‌రి కిమ్ యో జాంగ్ స్పందించారు.

అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్న ఆంటోనీ బ్లింకెన్‌, సైనిక అధిప‌తి లాయిడ్ విదేశీ యాత్ర‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో స‌మావేశ‌మై, ఉత్త‌ర కొరియాను ఎదుర్కొనేందుకు మంత్రాంగం న‌డుపుతున్నారు. సౌత్ కొరియాతో సైనిక కార్య‌క‌లాపాలు కూడా నిర్వ‌హిస్తుండ‌డంతో జాంగ్ ఘాటుగా స్పందించారు.

త‌మ‌పై సాగుతున్న కుట్ర‌ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌హించ‌బోమని చెప్పారు. త‌మ‌కు గ‌న్ పౌడ‌ర్ వాస‌న చూపించాల‌ని ఆరాట‌ప‌డితే మీకే ఇబ్బంది అని అన్నారు. త‌మ‌తో పెట్టుకుంటే ఎవ‌ర్నీ ఎవ‌ద‌ల‌బోమ‌ని, కొత్త అధ్య‌క్షుడు నాలుగేళ్లూ ప్ర‌శాంతంగా నిద్ర‌పోవాల‌ని అనుకుంటే.. త‌మ‌ను గ‌ల‌కొద్ద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.