Begin typing your search above and press return to search.

దక్షిణ కొరియాపై మరోసారి రెచ్చిపోయిన 'కిమ్' సోదరి..!

By:  Tupaki Desk   |   26 Nov 2022 12:30 AM GMT
దక్షిణ కొరియాపై మరోసారి రెచ్చిపోయిన కిమ్ సోదరి..!
X
ఉత్తర కొరియా-దక్షిణ కొరియాలు రెండు దేశాలు విడిపోయినప్పటికీ నుంచి ఆ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా దేశాల అధ్యక్షులు సైతం ఎవరికీ వారు ఒకరిపై ఒకరు తరుచూ విమర్శలు చేసుకుంటుండడం కనిపిస్తూ ఉంటుంది. ఇక వీరి మధ్యలో అమెరికా చేరి చలిమంటలు కాచుకోవడం నిత్యకృత్యంగా మారిందనే సంగతి అందరికీ తెలిసిందే.

ఉత్తర కొరియా-దక్షిణా కొరియా మధ్య సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఈక్రమంలోనే ఇరుదేశాలు ఒకరిని మించి మరొకరు క్షిపణి ప్రయోగాలు చేస్తూ మరో దేశాన్ని హడలెత్తించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ రెండు దేశాల వద్ద అణ్వాయుధాలు ఉండటంతో వీరి గొడవ ఎక్కడ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో నెలకొని ఉంది.

ఇక ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ నియంత మాదిరిలా వ్యవహరిస్తుండనే పేరు ఉంది. ఎవరెన్ని చెప్పినా విన్పించుకోకుండా ముందుకెళ్లడం కిమ్ జొంగ్ నైజం. అమెరికా ఆంక్షలను కూడా లెక్కింపు చేయకుండా కిమ్ జొంగ్ ముందుకెళుతుంటాడు. ఈ నేపథ్యంలోనే అమెరికా దక్షిణ కొరియాపై స్నేహంగా ఉంటూ ఉత్తర కొరియాపై కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటుంది. వీరి కలయికపై ఉత్తర కొరియా ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూనే ఉంటోంది.

కాగా కిమ్ జొంగ్ ఉన్ పాలనలో అతని సోదరి కిమ్ యో జొంగ్ శక్తివంతమైన మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. దక్షిణ కొరియా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి కిమ్ యో జొంగ్ దక్షిణ కొరియా అధ్యక్షుడిని ఆమె మూర్ఖుడితో పోల్చడంతోపాటు తీవ్రమైన పదజాలాన్ని వాడారు. అమెరికా చెప్పినట్లు దక్షిణ కొరియా ఆడుతుందంటూ కిమ్ జొంగ్ మండిపడ్డారు.

ఇటీవల దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే కిమ్ జొంగ్ ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యేల్.. ఆయన ప్రభుత్వంలోని నేతలందరినీ మూర్జులతో పోల్చాడు. మూన్ జే ఇన్ అధికారంలో ఉన్నప్పుడు దక్షిణి కొరియా తమకు లక్ష్యం కాదన్న ఆమె ఇప్పుడు అమెరికా.. దక్షిణా కొరియాలు తోడుదొంగలుగా వ్యవహరిస్తూ తమపై ఆంక్షలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కిమ్ సోదరి వ్యాఖ్యలపై దక్షిణ కొరియా సైతం తీవ్రంగా స్పందించింది. తమ అధినేత.. ప్రభుత్వ నేతలను బెదిరింపులకు గురిచేసేలా మాట్లాడటం సరైంది కాదన్నారు. దక్షిణ కొరియాలో ప్రభుత్వ వ్యతిరేకులను ప్రోత్సహించేలా కిమ్ జొంగ్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ మండిపడింది. అయితే ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం ఇదేమీ కొత్త కాదని.. గతంలోనూ కిమ్ జోంగ్ దక్షిణ కొరియా నేతలపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు గుర్తు చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.