Begin typing your search above and press return to search.

కిమ్ తాగే మందు పేరేంటో తెలుసా ..?

By:  Tupaki Desk   |   11 May 2020 3:05 PM IST
కిమ్ తాగే మందు పేరేంటో తెలుసా ..?
X
కిమ్ జోంగ్ ఉన్.. ఆ పేరే ఒక సంచలనం. ఆయన ఏం చేసినా? ఏం మాట్లాడినా అంచనాలకు మించి సంచలనాలు సృష్టిస్తారు. కిమ్ 2011లో ఉత్తర కొరియా పాలకుడు కావడం కూడా ఓ సంచలనమే. చాలా తక్కువ రాజకీయ - సైనిక అనుభవంతో ఆయన పాలకుడయ్యారు. తండ్రి మరణం తర్వాత కేవలం పదిహేను రోజుల్లోనే పార్టీ అధ్యక్షుడిగా - దేశ సైన్యాధిపతిగా నియమితులైన యువ కిమ్ తండ్రికి తగ్గ తనయుడని గుర్తింపు పొందారు. తండ్రికి వారసుడిగా కిమ్ ఎదుగుతారని మొదట్లో ఎవరూ అనుకోలేదు. అందరూ అతడి సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ - లేదా సొంత అన్న కిమ్ జోంగ్ చోల్‌.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు వారసుడు అవుతారని విశ్లేషకులు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ కిమ్ అధ్యక్ష పదవి చేపట్టారు.

కిమ్ తరచుగా తన రక్షణ శాఖ మంత్రులను మారుస్తుంటారు. 2011 నుంచి ఇప్పటి వరకూ కనీసం ఆరుగురు వ్యక్తులు ఈ పదవిలో ఉన్నారు. కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అందుకు కారణం ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచారు. కిమ్ భార్య పేరు రి సోల్ జు. కిమ్ తరచుగా తన రక్షణ శాఖ మంత్రులను మారుస్తుంటారు. 2011 నుంచి ఇప్పటి వరకూ కనీసం ఆరుగురు వ్యక్తులు ఈ పదవిలో ఉన్నారు.

కాగా, కిమ్ లైఫ్ స్టైల్ ఈ భూ ప్రపంచంపై ఎవరికీ ఉండదు. ఒకవైపు తన దేశంలోని ప్రజలు ఆకలితో అలమటిస్తూ.. ఆహారం కోసం పోరాడుతుంటే.. అధ్యక్షుడు మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా తినే తిండి నుంచి తాగే ముందు వరకు.. అన్నీ కూడా హై బ్రాండ్ నే వాడుతూ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ముఖ్యంగా తనకి ఎంతో ఇష్టమైన మద్యాన్ని విదేశాలనుండి దిగుమతి చేసు కుంటాడు. ఉత్తర కొరియాలో తయారయ్యే లిక్కర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కిమ్ తన కోసం తన కుటుంబ సభ్యుల కోసం హయ్యర్ అఫిషియల్ కోసం.. లిక్కర్ ను పరాయి దేశం నుండి దిగుమతి చేసుకుంటాడు . దాని కోసం కోట్లు వెదజల్లు తాడు. అమెరికన్ బ్రాండ్ లిక్కర్ కోసం దాదాపుగా 26 వేల డాలర్లను ఒక్కసారికి ఖర్చు చేశాడు. ఇంకా హెన్నెసీ వంటి ఖరీదైన బాటిల్స్ అంటే కిమ్ కి భలే ఇష్టం. అలాగే జర్మనీ బ్రాండ్ అంటే ఎంతో ఇష్టంగా తాగుతాడు. కిమ్ తాగే జర్మన్ వైన్ ఖరీదు 95,394 డాలర్లు. ఈ వైన్ ను ఎంతో ఇష్టంగా తెప్పించుకొని తాగుతాడు కింగ్. అలాగే తన కడుపు నింపుకోవడానికి కూడా ఏమాత్రం వెనకడుగు వేయడు. డెన్మార్క్ దేశం నుండి తనకు ఎంతో ఇష్టమైన పంది మాంసాన్ని కూడా దిగుమతి చేసు కుంటాడు. ఇక 2016లో అయితే తనకు ఎంతో ఇష్టమైన బ్రెజిలియన్ కాఫీ కోసం 21 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కిమ్ ఒకరోజుకి కేవలం తినడానికి , తాగడానికి కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంటే అక్కడి ప్రజలకు మాత్రం తినడానికి తిండి ఉండకపోవడం గమనార్హం.