Begin typing your search above and press return to search.

ఏంటి ఆ నియంత సారీ చెప్పడమా?

By:  Tupaki Desk   |   25 Sept 2020 11:00 PM IST
ఏంటి ఆ నియంత సారీ చెప్పడమా?
X

కిమ్ జాంగ్ ఉన్.. ఉత్తరకొరియా అధ్యక్షుడు. అధ్యక్షుడు అనే కంటే నియంత అనడం కరెక్ట్ ఏమో.. ఎందుకంటే తన రాజ్యాధికారం కోసం కిమ్ తన బంధువులు, పోటీదారులు సహా అడ్డు వచ్చిన వారందరినీ చంపించారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఉత్తరకొరియాలో వందల మందిని దారుణంగా చంపిన రక్తచరిత్ర ఆదేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ సొంతం అని అందరికీ తెలిసిందే..

అయితే తాజాగా కిమ్ వారి దేశస్థులనే కాదు.. పక్కనున్న ఉత్తరకొరియా అధికారిని కూడా చంపడం దుమారం రేపింది.ఈ నేపథ్యంలో ఈ నియంత సారీ చెప్పడం విశేషం. ఇది అందరినీ ఆశ్చర్య పరిచింది.

దక్షిణ కొరియా దేశానికి చెందిన అధికారిని చంపేయడంపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారని తాజాగా దక్షిణ కొరియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడ్ మూన్ జే ఇన్ కు పంపిన సందేశంలో కిమ్ క్షమాపణలు చెప్పారని దక్షిణ కొరియా చెబుతోంది. ఈ మేరకు కిమ్ లేఖ పంపించారని చెబుతున్నారు.

దక్షిణ కొరియా దేశానికి చెందిన 47 ఏళ్ల అధికారి ఉత్తరకొరియా జలాల్లో కనిపించడంతో ఆ సైన్యం తుపాకులతో కాల్చి చంపారని.. ఆ తరువాత ఆయన మృతదేహాన్ని తగుల బెట్టారని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది.

దీనిపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ క్షమాపణ చెప్పారు. తమ దేశ జలాల్లోకి ప్రవేశించిన తరువాత సరిహద్దు గస్తీ దళాలు ప్రశ్నించాయని.. తానెవరన్నది చెప్పకుండా పారిపోయే ప్రయత్నం చేయడంతో కాల్పులు జరిపారని.... మొత్తం 10 రౌండ్లు ఆయనపై కాల్చారని ఉత్తరకొరియా తెలిపింది.

కాగా కరుడుగట్టిన ఎంతో మందిని చంపిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఇంతవరకు దానిపై సంతాపం కానీ.. పశ్చాత్తాపం కానీ వ్యక్తం చేయలేదు.కానీ పొరుగుదేశపు అధికారిని చంపడంతో అంతటి నియంత క్షమాపణ చెప్పడం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. కిమ్ పూర్తిగా మారిపోయాడనడానికి ఇది నిదర్శనమని పలువురు చెబుతున్నారు.