Begin typing your search above and press return to search.

ఉత్తరకొరియా కూడా భారత్ ను చూసి ఎగతాళి చేస్తున్న పరిస్థితి మోడీ జీ!

By:  Tupaki Desk   |   6 May 2021 9:02 AM IST
ఉత్తరకొరియా కూడా భారత్ ను చూసి ఎగతాళి చేస్తున్న పరిస్థితి మోడీ జీ!
X
ఆఖరుకు నియంత పాలనలో ఉన్న ఉత్తరకొరియా కూడా భారత్ ను చూసి ఎగతాళి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంతకంటే దరిద్రం.. దౌర్భాగ్యం మరొకటి లేదు. ఒక నియంత పాలనలో స్వేచ్చ, స్వాతంత్రాలు లేని దేశంలో.. కనీస వసతులు ఆధునికతకు దూరంగా ప్రజస్వామ్యం లేని ఆ కటిక నిరుపేద దేశం కూడా ఇవన్నీ ఉన్న భారత్ పై ఎగతాళి చేయడం చర్చనీయాంశమైంది.

తాజాగా భారత్ పేరును ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేసింది ఉత్తరకొరియా ప్రభుత్వం. కరోనా వైరస్ పై గెలిచామని భావించి విదేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేసి ఆంక్షల్ని సడలించిన ఓ దేశంలో ఇప్పుడు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయంటూ పరోక్షంగా భారత్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది ఉత్తరకొరియా ప్రభుత్వం.

ఉత్తరకొరియాకు కరోనా వ్యాక్సిన్లు ఎప్పుడు ఎలా అందుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో ఆ దేశ అధికారిక వర్కర్స్ పార్టీ అధికారిక వార్త పత్రిక ‘రోడోంగ్ సిన్మన్’లో ఈ మేరకు కథనం ప్రచురితమైంది.

కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆ కథనంలో పేర్కొంది. వ్యాక్సిన్లు ఎప్పుడూ అంతిమ పరిష్కారం అంతిమ పరిష్కారం తెలిపింది. వివిధ దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని .. కొన్ని వ్యాక్సిన్ల భద్రతపై ఆందోళనలు తలెత్తుతున్నట్లు రిపోర్టులు వస్తున్న విషయాన్ని ఆ కథనంలో పేర్కొంది.

దీన్ని బట్టి ఆఖరికి ఉత్తర కొరియా కూడా మనల్ని చూసి ఎగతాళి చేస్తున్న పరిస్థితి నెలకొంది.