Begin typing your search above and press return to search.
పెంపుడు కుక్కల్ని కిమ్ లాగేసుకుంటున్నారు ఎందుకో తెలుసా?
By: Tupaki Desk | 19 Aug 2020 10:15 AM ISTవికారంగా అనిపిస్తుంది కానీ ఇది నిజం. మనం చికెన్.. మటన్.. ఫిష్ ఎంత ఇష్టంగా తింటామో.. ప్రపంచంలోని కొన్ని దేశాల వారి ఆహారపు అలవాట్లు చాలా సిత్రంగా ఉండటం తెలిసిందే. చైనా ప్రజలు గబ్బిలాల్ని.. పాముల్ని.. తినటం తెలిసిందే. మరికొన్ని దేశాల్లో కీటకాల్ని వండించి తినేస్తుంటారు. అదే తీరులో ఉత్తర కొరియా ప్రజలు కుక్క మాంసాన్ని మహా ఇష్టంగా తినేస్తారు. వామ్మో అనుకున్నా.. ఇది నిజం.
ఇదిలా ఉంటే.. తాజాగా ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కమ్ కిమ్.. దేశంలో పెంపుడు కుక్కల్ని పెంచుకుంటున్న వారందరి నుంచి కుక్కల్ని లాగేసుకునే పని పెట్టుకున్నారు. ఎందుకంటారా? ఇప్పుడా దేశంలో ఆహార సరఫరాలో సంక్షోభం తలెత్తింది. ఆ దేశంలోని ప్రముఖ రెస్టారెంట్లలో కుక్క మాంసానికి తీవ్రమైన కొరత వచ్చేసింది. దీంతో.. ఆ సమస్యకు పరిష్కారంగా దేశంలో కుక్కల్ని పెంచుకునే యజమానుల నుంచి వాటిని లాగేసుకొని.. రెస్టారెంట్లకు పంపించేస్తున్నారు.
ఆ దేశంలో పేద ప్రజలు పందులు.. కోళ్లను పెంచుకుంటే.. ఎగువ మధ్యతరగతి వారు.. ఉన్నతాధికారులు.. సంపన్న కుటుంబాల వారు మాత్రం కుక్కల్ని పెంచుకుంటున్నాయి. తాజాగా.. ప్రజలు చెల్లించాల్సిన పన్ను బకాయిల్ని వసూలు చేసుకునేందుకు భారీగా కుక్కల్ని తీసేసుకుంటున్నారట. అంులో అవసరమైనన్ని కుక్కల్ని రెస్టారెంట్లకు పంపి.. మిగిలిన వాటిని జూలకు పంపుతున్నారట. దీంతో.. వారి వేదన అంతా ఇంతా కాదన్నట్లుగా మారింది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకునే కుక్కల్ని అధికారులు లాక్కెళ్లి పోవటంతో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.ఇదంతా చూస్తుంటే.. కిమ్ కు పోయే కాలం దాపురించిందా? అన్న సందేహం కలుగక మానదు.