Begin typing your search above and press return to search.
బతికున్న తండ్రిని చంపేశాడు ...ఎందుకంటే ?
By: Tupaki Desk | 24 Jun 2020 8:00 AM ISTతండ్రి ఆస్తిపై రుణం తీసుకోవడానికి ఓ సుపుత్రుడు భారీ స్కెచ్ వేశాడు. ఆస్తి కోసం బతికున్న తండ్రి చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ సృష్టించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయం తండ్రికి తెలియడంతో షాక్ అయ్యాడు. రామసముద్రం మండలం నర్సాపురంకు చెందిన రైతుకు కొంత భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన కొడుకు ఎలాగైనా దక్కించుకోవాలని భావించాడు. ఈ ఆస్తిని కొట్టేయడానికి భార్యతో కలిసి కన్నింగ్ ప్లాన్ వేశాడు.
కొడుకు తన తండ్రి చని పోయినట్లు ఓ డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చాడు. ఆ డాక్యుమెంట్ తో తన పేరు మీదకు భూమిని మార్చే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తండ్రికి తెలియడంతో షాకయ్యాడు. తాను బతికే ఉన్నాను అంటూ బయట కు వచ్చాడు. ఆర్డీవో ను ఆశ్రయించి జరిగిన స్టోరీ చెప్పాడు. తన భూమిని కాజేసేందుకు కొడుకు కోడలు ఇలా చేశారని బాధితుడు అంటున్నాడు. తనకు అన్యాయం జరిగిందని, కొడుకు పై చర్యలు తీసుకోవాలని కోరాడు. అయితే ఈ డెత్ సర్టిఫికేట్ విషయంలో రైతు కొడుక్కి రెవెన్యూ అధికారులు కొందరు సహకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై అధికారులు ఆరా తీస్తున్నారు.