Begin typing your search above and press return to search.
తిరుమలలో కిడ్నాప్ కలకలం.. అసలు ట్విస్ట్ ఏమిటంటే !
By: Tupaki Desk | 9 Nov 2020 3:20 PM ISTకలియుగ ప్రత్యక్ష దైవం , ఆ ఏడు కొండలవాడు కొలువైఉన్న క్షేత్రం తిరుమల మళ్లీ చాలా రోజుల తర్వాత భక్తులతో నిండుగా కనిపించింది. శనివారం నాడు ఉదయం నుంచి రాత్రి వరకు 30,705 మంది భక్తులు ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. లాక్ డౌన్ తర్వాత మొదలుపెట్టిన శ్రీవారి దర్శనాల్లో ఒక్కరోజులో ఇంతమంది దర్శనం చేసుకోవడం ఇదే మొదటిసారి. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ... తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆదివారం కిడ్నాప్ కలకలం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన హనుమంతరావు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే ఎస్పీటీ రెస్ట్ హౌస్ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల వచ్చి హనుమంతరావును కిడ్నాప్ చేశారు. కళ్ల ముందే దుండగులు కిడ్నాప్ చేయడంతో అతని కుటుంబసభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు.అయితే హనుమంతు భార్య వెంటనే అప్రమత్తమై దుండగులు కిడ్నాప్‌నకు ఉపయోగించిన వాహనం నంబర్‌ను గుర్తు పట్టారు. తక్షణమే హనుమంతు భార్య వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది.
ఆ సమాచారంతో రంగంలోకి దిగిన తిరుమల పోలీసులు కిడ్నాపర్లకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అలిపిరి వద్ద పోలీసులు కాపు కాసి నిందితుల వాహనాన్ని నిలిపివేశారు. వెంటనే కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితులంతా అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. హనుమంతరావు రూ. 20 లక్షలు మోసం చేశారని కిడ్నాపర్లు అంటున్నారు. అయితే ఆయనపై కేసు పెట్టినప్పటి నుంచి హనుమంతరావు పరారీలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ సంగతి ఇలా ఉంటే కిడ్నాప్ కు ప్రయత్నించిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.