Begin typing your search above and press return to search.

వైరల్: డాక్టర్ హుస్సేన్ ను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఆడియో

By:  Tupaki Desk   |   28 Oct 2020 3:30 PM GMT
వైరల్: డాక్టర్ హుస్సేన్ ను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఆడియో
X
హైదరాబాద్ కు చెందిన డాక్టర్ హుస్సేన్ ను కిడ్నాప్ చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో కిడ్నాప్ చేసి అనంతపురం మీదుగా బెంగళూరుకు వెళ్తున్న కిడ్నాప్ గ్యాంగ్ ను పోలీసులు ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు పట్టుకోగా.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

అనంతపురం జిల్లాలో అన్ని చెక్ పోస్టులను ఎస్పీ సత్య యేసుబాబు అప్రమత్తం చేశారు. రాప్తాడు పోలీసులు కిడ్నాపర్లను పట్టుకొని డాక్టర్ హుస్సేన్ ను రక్షించారు.

ఈ కిడ్నాప్ వ్యవహారంలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ హుస్సేన్ అకౌంట్ లో పెద్ద మొత్తంలో నగదు ఉందని తెలుసుకున్న బంధువు ముస్తాఫా ఈ కిడ్నాప్ కు స్కెచ్ వేశాడు. డాక్టర్ హుస్సేన్ ఇంటిపైన కిరాయికి వుండే ఖలీద్ అనే వ్యక్తి ద్వారా ఈ కిడ్నాప్ చేయించాడని పోలీసుల విచారణలో వెల్లడైనట్టు తెలిసింది.

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ముస్తాఫా.. డాక్టర్ హుస్సేన్ ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ వేశాడు.కిడ్నాప్ చేశాక వాట్సాప్ కాల్ చేసి హుస్సేన్ కుటుంబ సభ్యులను డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు బిట్ కాయిన్ రూపంలో కావాలని చెప్పాడు. ఆయన భార్యకు ఫోన్ చేసి బెదిరించాడు.

నీ భర్త నా గన్ పాయింట్ దగ్గర ఉన్నాడని.. పదికోట్ల రూపాయలు బిట్ కాయిన్ల రూపంలో పంపించాలన్నాడు. కాదని పోలీసులకు ఫోన్ చేస్తే చంపేస్తానని హెచ్చరించాడు. 48 గంటల్లో క్యాష్ గోల్డ్ లేక బిట్ కాయిన్ల రూపంలో పంపించాలని డిమాండ్ చేశారు. ఈ ఆడియో ఇప్పుడు లీక్ అయ్యింది. మీడియాలో రావడంతో వైరల్ అయ్యింది.