Begin typing your search above and press return to search.

కుక్కబొమ్మ మింగేసిన పిల్లాడి పరిస్థితి చూడండి!

By:  Tupaki Desk   |   18 Aug 2016 4:23 AM GMT
కుక్కబొమ్మ మింగేసిన పిల్లాడి పరిస్థితి చూడండి!
X
చిన్న కుక్క బొమ్మ మింగేసిన ఒక కుర్రాడి చేస్తున్న హడావిడికి ఒకటి వెలుగులోకి వచ్చింది. మనదేశంలో కొంతమంది బాబాలు మింగేసిన లింగాలను - గొంతులో నుంచి బయటకు తీసే ప్రక్రియ బాగా ఫాలో అయ్యారో ఏమో కానీ.. చిన్నపాటి టెక్నిక్‌ తో మింగేసిన బొమ్మను తీసేయొచ్చని ఒక కుర్రాడికి ఎవరో చెప్పారట. దాంతో ఒక కుక్కబొమ్మను మిగేసి.. తీసే పరిస్థితి లేకపోవడంతో కుక్కలా అరుస్తున్న ఈ కుర్రాడికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ నెట్ వర్క్స్ లో వైరల్ అవుతుంది.

అచ్చు రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన "బామ్మ మాట బంగారు బాట" సినిమాలో విజిల్ మింగేసిన నూతన ప్రసాద్ లా ప్రవర్తిస్తున్నాడు అమెరికాకు చెందిన ఆంథోనీ. ఆ సినిమాలో విజిల్ మింగేసిన తర్వాత నూతన ప్రసాద్ మాట్లాడిన ప్రతిసారీ మాటకు బదులు ఈల వినిపిస్తుంది. అదేవిదంగా ఈ కుర్రాడి పరిస్థితి కూడా తయారయ్యింది. అమెరికాకు చెందిన ఆంథోనీ అనే ఈ కుర్రాడు ఒక కుక్క బొమ్మ మింగేశాడు. తర్వాత దానిని తీయడం సాధ్యం కాకపోవడంతో లబోదిబోమంటున్న ఆ కుర్రాడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏం జరిగిందని వైద్యులు ఆ కుర్రాడిని ప్రశ్నించినప్పుడు ఆ కుర్రాడు నుంచి వచ్చిన సమాధానం విని అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. ఆ కుర్రాడు మాట్లాడిన ప్రతిసారి మాటలకు బదులు కుక్కపిల్ల అరుపులు వినిపిస్తున్నాయి. గట్టిగా గాలిపీల్చినా - వదిలినా - దగ్గినా కూడా అదే కుక్కపిల్లల సౌండే. దీంతో బాలుడి కడుపులోంచి బొమ్మను తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన వైద్యులకు ఇలా వీలుకాకపోవడంతో ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారట.

ప్రస్తుతం సోషల్ నెట్ వర్క్స్ లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో అప్‌ లోడ్ అయిన కొన్ని గంటల్లోనే దాదాపు 90 లక్షల మంది చూశారట. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఈ కుర్రాడు పడే బాదసంగతి పక్కనపెట్టి.. పడీ పడీ నవ్వుతుండటం గమనార్హం. అలా ఉంది మరి మనోడి ప్రవర్తన!!