Begin typing your search above and press return to search.
కియా ఎపిసోడ్... ఓ చక్కటి సామెత గుర్తొస్తోందబ్బా
By: Tupaki Desk | 7 Feb 2020 10:19 PM ISTదున్నపోతు ఈనిందని చెప్పగానే... ముందూ వెనుకా చూసుకోకుండా దూడను కట్టేయండిరా అన్నాడట వెనకటికి ఎవడో?. గురు, శుక్రవారాలు... రెండు రోజుల పాటు ఏఫీలో కొనసాగిన ‘కియా’ కలకలాన్ని పరిశీలిస్తే... పాతదైన ఈ ముతక సామెతే గుర్తుకు వస్తోందని చెప్పాలి. ఎందుకంటే... ఏపీలోని అనంతపురం జిల్లాలో ఏర్పాటైన ఈ కొరియా కంపెనీ ఇప్పటికే తన కార్ల ఉత్పత్తిని ప్రారంభించేసింది. అనంతపురం ప్లాంట్ లో ఉత్పత్తి అయిన కార్లను దేశీయ విఫణిలోకి ప్రవేశపెట్టేసింది. విభిన్నంగానే కాకుండా చూడ ముచ్చటగా, ఇతర కార్లకు ధీటుగా కనిపిస్తున్న కియా కార్లు దేశ ప్రజలను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని రోజులు ఆగితే.. కియా కార్లు దేశీయ విఫణిలో ఫేవరేట్ మోడల్స్ గా మారడం ఖాయమే. ఇలాంటి నేపథ్యంలో అటు ఏపీతో సంబంధం లేని, ఇటు కియాతో సంబంధం లేని ఓ పత్రిక రాసిన కథనం పై రెండు రోజుల పాటు రచ్చ రచ్చ సాగింది.
కియా కార్ల కంపెనీ తన అనంతపురం ప్లాంట్ ను తమిళనాడు కు తరలిస్తోందని, ఏపీలోని జగన్ సర్కారు వ్యవహార సరళి కారణంగానే కియా ఈ నిర్ణయం తీసుకుందని అంతర్జాతీయ ప్రతికగా పేరు సంపాదించుకున్న ‘రాయిటర్స్’ ఓ కధనాన్ని రాసింది. ఈ కథనాన్ని పట్టుకుని విపక్ష టీడీపీ ఓ రేంజిలో గురువారం రచ్చను స్టార్ట్ చేసింది. రాయిటర్స్ అంటే... విశ్వవ్యాప్తంగా ఓ మంచి పేరున్న పత్రికే కదా. దీంతో వైసీపీ నేతలు కూడా ముందు షాక్ తిన్నారు. వైసీపీ సర్కారులోని పలువురు ప్రముఖులు నేరుగా కియా కంపెనీ ప్రతినిధులు, యాజమాన్యాన్ని అప్పటికప్పుడే సంప్రదించారు. ఈ క్రమంలో రాయిటర్స్ కథనం పూర్తిగా కల్పితమని, సత్యదూరమైన కథనమేనని తేలిపోయింది. అయినా కూడా టీడీపీ తన రచ్చను ఆపలేదు కదా.. మరింతగా దానికి ఆజ్యం పోసింది. అందుబాటులో ఉన్న ప్రతి టీడీపీ నేత కూడా మీడియా ముందుకు వచ్చి రాయిటర్స్ కథనాన్ని చూపి తమదైన శైలిలో వైసీపీపై విరుచుకుపడ్డారు. ఈ కామెంట్లకు కౌంటర్లిచ్చేందుకు వైసీపీ నేతలు కూడా నానా తిప్పలూ పడ్దారు.
చివరకు ఏమైందన్న విషయానికి వస్తే... అసలు తమ ప్లాంట్ ను తమిళనాడు కు తరలించాలని తాము అసలు అనుకోలేదని, అసలు అలాంటి ప్రతిపాదనే లేదని కూడా స్వయంగా కియా ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు. సదరు ప్రకటనను అనంతపురంలోని ప్లాంట్ వద్ద కంపెనీ పీఆర్వో స్వయంగా మీడియా ఎదుట చదివి వినిపించారు. ఆ ప్రకటనలో ఏముందన్న విషయానికి వస్తే... ‘‘కియా పరిశ్రమ ను తమిళనాడు కు తరలిస్తారన్న వదంతులు నమ్మొద్దు. ఇండియా మార్కెట్ లక్ష్యంగా అనంతపురంలో మా యూనిట్ ను ఏర్పాటు చేశాం. ఇక్కడి నుంచి దీనిని ఎక్కడికీ తరలించడం లేదు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. ఈ యూనిట్ నుంచే కొత్త మోడళ్లను ఉత్పత్తి చేస్తాం’’ అని కియా ఎండీ సదరు ప్రకటనలో క్లిస్టర్ క్లియర్ గా చెప్పేశారు. వాస్తవం ఇది అయితే... రాయిటర్స్ కథనాన్ని ఆసరా చేసుకుని రెండు రోజుల పాటు టీడీపీ నేతలు, స్వయంగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేసిన రచ్చ అంతా చూస్తుంటే... నిజంగానే దున్నపోతు ఈనిందంటే... దూడను కట్టేయమన్నట్లుగానే ఉందన్న వాదన వినిపిస్తోంది.