Begin typing your search above and press return to search.

బీజేపీలోకి ఖుష్బూ.. నేడు క్లారిటీ వచ్చే ఛాన్స్!

By:  Tupaki Desk   |   12 Oct 2020 11:06 AM IST
బీజేపీలోకి ఖుష్బూ.. నేడు క్లారిటీ వచ్చే ఛాన్స్!
X
తమిళనాడులో ఎన్నికలకు ఇక ఏడు నెలలే గడువు ఉండటంతో రాజకీయ కాక ఇప్పటినుంచే మొదలైంది. ఎన్నికల సంవత్సరంలో అన్ని పార్టీల నాయకులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి. అంటూ జంప్ చేయడం మామూలే. కాగా కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి ఖుష్బూ బీజేపీ లో చేరనున్నట్లు వస్తున్న వార్తలు తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్నాయి. ఖుష్బూ సోమవారం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్.మురుగన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలసి బీజేపీలో చేరనున్నట్లు ఆ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు ఒకరు వెల్లడించారు. ఖుష్బూతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, సోమవారమే అవి ఒక కొలిక్కివచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

ఆదివారం చెన్నై విమానాశ్రయంలో కొందరు మీడియా ప్రతినిధులు బీజేపీలో చేరడానికే ఢిల్లీ వెళుతున్నారా.. అని ఖుష్బూను ప్రశ్నించగా "నేను దేని గురించి మాట్లాడలేను'' అంటూ సమాధానం ఇచ్చారు. అక్టోబర్ మొదటి వారంలో కూడా ఆమె ఢిల్లీ వెళ్ళగా అప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి.'' రెండు రూపాయలు ఖర్చు పెట్టి ఎవ్వరైనా ఒక్క ట్వీట్ చేసి పుకార్లను వ్యాప్తి చేయొచ్చని " అన్నారు. అప్పుడు ఆ వుహగానాలను కొట్టిపారేశారు. కేంద్రం నూతన విద్యా విధానం తీసుకు వచినప్పుడు కూడా ఖుష్బూ బీజేపీని పొగడ్తలతో ముంచెత్తింది. అప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురవగా ఆమె ఖండించారు. శనివారమే ఆమె 'నాలో మార్పు చూస్తారు..మార్పు అనివార్యం' అంటూ ట్వీట్ చేశారు. బహుశా బీజేపీలో చేరే విషయమై ఆమె పరోక్షంగా వెల్లడించినట్లు అర్థమవుతోంది.