Begin typing your search above and press return to search.
మోడీకి కుష్బూ మద్దతు .. బీజేపీలో చేరబోతున్నారా ?
By: Tupaki Desk | 31 July 2020 12:00 PM ISTతెలుగులో అగ్ర హీరోలందరి సరసన నటించిన సీనియర్ హీరోయిన్ కుష్బూ ..ఈ మధ్య సినిమాలకి కొంచెం దూరంగా ఉంటూ ప్రజా సేవ చేయడం కోసం జాతీయ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. అలాగే గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటుంది. అయితే , తాజాగా కుష్బూ చేసిన తాజా వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించిన కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రముఖ సిని నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ మద్దతు తెలిపింది. ఈ అంశం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కేంద్రం తీసుకువచ్చిన కొత్త విద్యా విధానంలోని పలు అంశాలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా విద్యా విధానంలో మోదీ సర్కారు మార్పులు తెస్తోందని ఆ పార్టీ నేతలు పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా కొత్త విద్యా విధానాన్ని సమర్థిస్తూ కుష్బూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పెద్దలు వ్యతిరేకిస్తున్న విధానానికి కుష్బూ మద్దతు పలకడంతో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో డీఎంకే నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కుష్బూ... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని కొందరు మాట్లాడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో తన వైఖరిపై మరింత క్లారిటీ ఇస్తూ కుష్బూ మరో ట్వీట్ చేశారు. జాతీయ కొత్త విద్యా విధానం విషయంలో తన వైఖరి, పార్టీ వైఖరికి భిన్నంగా ఉందని, దీని పట్ల తాను పార్టీ నేత రాహుల్ గాంధీకి క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. అయితే తాను రోబోలా పనిచేయలేనని, తన మనసుకు కరెక్టని భావిస్తే అదే చెబుతానని, నాయకుడి చెప్పేది ప్రతి ఒక్కటీ సమర్థించే పద్ధతి కాకుండా...ఓ పౌరురాలిగా తన అభిప్రాయాన్ని చెప్పే ధైర్యం ఉండాలని భావిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. ఈ మాత్రానికే నేను బీజేపీలోకి చేరతాను అని అనుకోవడం మీ పొరపాటే అని క్లారిటీ ఇచ్చారు.