Begin typing your search above and press return to search.

చదువు రాని వారిని బీజేపీ చీట్ చేస్తోంది - ఖుష్బూ

By:  Tupaki Desk   |   15 March 2020 10:07 PM IST
చదువు రాని వారిని బీజేపీ చీట్ చేస్తోంది - ఖుష్బూ
X
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు గోమూత్రం మంచి ఔషధమని అఖిల భారతీయ హిందూ మహాసభ పేర్కొంది. అంతేకాదు - గోమూత్ర పార్టీ పేరుతో కార్యక్రమం నిర్వహించి - దాదాపు 200 మంది గోమూత్రాన్ని సేవించారు. గోమూత్రం తాగితే కరోనా దరి చేరదన్నారు. మరిన్ని గోమూత్ర పార్టీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. అయితే దీనిపై ప్రముఖ నటి, తమిళనాడు కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా దీనిపై ఆగ్రహించారు.

గుడ్డివారు ఇకనైనా మేల్కొనాలి - గోమూత్ర అన్ని రోగాలను నయం చేస్తుందనే చెత్త ప్రచారాన్ని ఆపేయాలని - ఇలాంటి వాటితో ప్రజల జీవితాలను ప్రమాదంలో పడవేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో మతాలను - కాషాయ రంగును తీసుకు రావొద్దని హితవు పలికారు. చదువురాని పేదవారిని తప్పుదోవ పట్టించవద్దన్నారు.

అంతేకాదు, ప్రొఫెసర్ స్టీవ్ హాంకే చేసిన ట్వీట్‌ ను కూడా ఆమె రీట్వీట్ చేస్తూ హితబోధ చేశారు. ఆవు మూత్రం వల్ల కరోనా వైరస్ నుండి బయటపడలేమని జాహన్స్ హోప్‌కిన్స్‌లోని తన సహచరులు వెల్లడించారని, ఇంకా చెప్పాలంటే ఇది మరింత అనారోగ్యానికి దారితీస్తుందని, భారత్‌ కు సైన్స్ గైడెన్స్ కావాలని ప్రొఫెసర్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. దీనిని షేర్ చేస్తూ ఖుష్బూ ఘాటుగా స్పందించారు.