Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : తృటిలో ఘోర ప్రమాదం నుండి బయటపడ్డ ఖుష్బూ

By:  Tupaki Desk   |   18 Nov 2020 4:00 PM IST
బ్రేకింగ్ : తృటిలో ఘోర ప్రమాదం నుండి బయటపడ్డ ఖుష్బూ
X
కోలీవుడ్ హాట్ హీరోయిన్ , బీజేపీ మహిళానేత ఖుష్బూ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడింది. చెన్నైలో ఆమె కారును ఓ భారీ కంటైనర్ ఢీ కొట్టింది. అయితే సరైన సమయంలో కారు లో ఉన్న ఎయిర్ బెలూన్ తెరుచు కోవడం తో పెను ప్రమాదం నుండి తృటిలో కుష్బూ తప్పించుకుంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత... తన పరిస్థితిని వివరిస్తూ ఓ ఖుష్బూ ట్వీట్ చేసింది. జరిగిన కారు ప్రమాదంలో తనకు ఏమీ కాలేదని, అభిమానుల ఆశీస్సులు , ఆ దేవుడి దీవెనలతో తాను ఆ ఘోర ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డానని కుష్బూ తెలిపింది. కుష్బూ ప్రమాదానికి గురైంది అన్న విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర బీజేపీ నేతలు ఆమెకి ఫోన్లు చేసి ఘటన గురించి అడిగి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా ఆమెకి కాల్ చేసి మాట్లాడారు.

చెన్నైలోని మెల్మరువతుర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కడలూరులో కుష్బూ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో కుష్బూ ప్రయాణీస్తున్న కారు ఓ వైపు పూర్తిగా దెబ్బతింది.ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. ఇకపోతే , గత నెలలో కుష్బూ కాంగ్రెస్ నుండి బీజేపీ కి జంప్ అయిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలోనే తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కుష్బూ వంటి వారి చేరికతో కాషాయ దళానికి కలిసి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. కుష్బూ 2014లో డీఎంకే నుంచి కాంగ్రెస్‌లో చేరారు.